-
-
Home » Mukhyaamshalu » Today Latest Breaking News and Live updates in Telugu 8th January 2024 Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Jan 08 , 2025 | 04:00 PM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-08T17:00:04+05:30
కేటీఆర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ఏసీబీకి..
విజిబుల్ డిస్టెన్స్ ఉందని కోర్టుకు తెలిపిన AAG
విచారణ సమయంలో కేటీఆర్‌ను విండో నుంచి చూడొచ్చు: AAG
న్యాయవాది ఉండేందుకు లైబ్రరీ రూమ్‌లో ఏర్పాట్లు: AAG
కేటీఆర్‌తో పాటు న్యాయవాది రాంచందర్‌రావు
కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
విచారణ సమయంలో లాయర్‌తో కలిసి కూర్చునే అవకాశం లేదు: హైకోర్టు
సీసీ టీవీ పర్యవేక్షణ లేదా..
కేటీఆర్ కనిపించేంత దూరంలో లాయర్ ఉండేందుకు కోర్టు అనుమతి
ఏసీబీ విచారణ సమయంలో..
విజిబుల్ డిస్టెన్స్‌లో న్యాయవాది రాంచందర్‌రావు ఉండేందుకు అనుమతి
రేపు ఏసీబీ విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు హైకోర్టు ఆదేశం
విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చు: హైకోర్టు
-
2025-01-08T16:57:40+05:30
కేంద్రం, ఏపీ, గోదావరి రివర్ బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ.
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు పై లేఖ రాసిన ప్రభుత్వం.
వరద జలాల ఆధారంగా గోదావరి పై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని అభ్యంతరం తెలుపుతూ లేఖ.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురైతున్నట్లు లేఖ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.
రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలేవరకు బనకచర్ల పనులు ఆపాలని లేఖలో పేర్కొన్న సర్కార్
-
2025-01-08T16:00:28+05:30
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం.
మాదాపూర్ డి మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో చెలరేగిన మంటలు.
ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్,అగ్ని మాపక సిబ్బంది.
మంటలను అదుపులోకి తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది.