Share News

6 PM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 06:15 PM

6 PM TOP 10 NEWS: ఆదివారం సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన టాప్ 10 వార్తలు మీకోసం.. ఆ వార్తలను ఇక్కడ చూడొచ్చు

6 PM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..
TOP 10 News

1) ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీయడంపై అనంత శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


2) ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం..

ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు రేపు చెక్కుల పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది. కారిడార్-6 లో ఎంజీబీఎస్ - చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


3) ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా కమ్మవారంటే ఆషామాషీ కాదని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అనేక మంది ప్రముఖులకు పుట్టినిల్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథ సత్యనారాయణ, కాకాని వెంకటరత్నం సహా అనేక మంది ప్రముఖులకు ఈ కృష్ణా జిల్లానే పుట్టినిల్లు అని సోదాహరణగా వివరించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


4) ఆలయాల సంరక్షణపై హైందవ సంఘాల డిక్లరేషన్

ఆలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్‌ మెడోస్‌ ప్రాంగణంలో ఇవాళ (ఆదివారం) హైందవ శంఖారావం (Hindu Sankharavam) సభ జరిగింది. ఈ సభలో వీహెచ్‌పీ (VHP) జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు భారీగా పాల్గొన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


5) బాబు రాకకు ముందే.. కుప్పానికి వరాలు..

ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకు ముందే కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిసింది. కుప్పం మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోలు విడుదల చేసింది. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధి కోసం ఏకంగా రూ.92.20 కోట్లు మంజూరయింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


6) అమ్మాయితో ఓయో రూమ్‌కు వెళ్తున్నారా.. మీ ఆశలు ఇక గల్లంతే..

పెళ్లికి ముందే ప్రైవసీ కోసం ఎక్కువమంది ఎంచుకునే ఆప్షన్ ఓయో రూమ్స్. వివాహంతో సంబంధం లేకుండా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు ఒయో రూమ్స్‌కు వెళ్తుంటారు. స్త్రీ, పురుషుల గుర్తింపు కార్డు చూపించి, టారిఫ్ చెల్లిస్తే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా రూమ్స్ కేటాయిస్తారు. ఎక్కువమంది కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిలు ఓయో సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


7) త్రివిక్రమ్ వెనుక పెద్ద మనుషులు.. అందుకే అన్యాయం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో (Trivikram) హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు (poonam kaur) మధ్య కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా గొడవ నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమె త్రివిక్రమ్‌పై విరుచుకుపడుతుంది. తాజాగా మరోసారి ఆమె ట్విట్టర్‌ వేదికగా త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. '‘త్రివిక్రమ్‌పై గతంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA)లో ఫిర్యాదు చేశా. అయితే ఆయన వెనక ఉన్న పెద్ద మనుషుల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యం, ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు" అంటూ మండిపడింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


8)కానిస్టేబుల్‌గా వరుణ్ సందేశ్.. ఉత్కంఠభరితమైన టీజర్

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


9) కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..

ఓటమి పరిపూర్ణమైంది. వరుస వైఫల్యాలతో పరువు తీసుకుంటున్న జట్టు.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. చెత్త ప్రదర్శనలతో అభిమానులు తలదించుకునేలా చేసింది టీమిండియా. ఆస్ట్రేలియా చేతుల్లో మరోసారి ఓడి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఒకదశలో 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న జట్టు.. చివరికి 1-3 తో సిరీస్‌ను కంగారూలకు అప్పగించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


10) మాట నిలబెట్టుకున్న కమిన్స్.. చెప్పిందే చేశాడు

కెప్టెన్స్‌గా ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యవహరిస్తారు. కొందరు వినయం, నమ్రతతో ఉంటే.. మరికొందరు కాస్త పొగరుగా, గర్వంతో ఉన్నట్లు కనిపిస్తారు. ఆస్ట్రేలియా జట్టు సారథులు రెండో కేటగిరీలోకి వస్తారు. క్రికెట్‌లో తమను మించిన వారు లేరు, తామే తోపులు అనేలా బిహేవ్ చేస్తుంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే యాటిట్యూడ్‌తో మాట్లాడుతుంటారు. ఆ జట్టు ప్రస్తుత సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2025 | 06:22 PM