Encounter: పోలీసులు, నేరస్థుల మధ్య ఎన్‌కౌంటర్.. నలుగురు మృతి
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:45 AM
నేడు ఉదయం పోలీసులు, నేరస్థుల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు కాగా, నలుగురు నేరస్థులు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈరోజు ఉదయం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు, నేరస్థుల ముఠా మధ్య జరిగిన ఓ ఎన్‌కౌంటర్(Encounter)లో నలుగురు నేరస్థులు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీలో జరిగింది. ముస్తఫా కగ్గా ముఠా సభ్యుడు అర్షద్ నేతృత్వంలో ఈ నేరస్థులు దోపిడీ, హత్యల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారు. అయితే ఇప్పటికే అర్షద్‌పై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. అతను అనేక హై ప్రొఫైల్ నేర కార్యకలాపాలలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
సహచరులు...
దోపిడీ, హత్యలకు సంబంధించి డజనుకు పైగా కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. అర్షద్‌తో పాటు, అతని సహచరులు మంజీత్, సతీష్, ఒక గుర్తు తెలియని వ్యక్తిని జింఝానాలో STF దళాలు చుట్టుముట్టాయి. ఆ క్రమంలో వారు STF బృందంపై కాల్పులు జరిపారు. ప్రతిస్పందించిన STF దళాలు తిరిగి కాల్పులు జరపడంతో అర్షద్‌తో సహా నలుగురు నేరస్థులు మరణించారు.
పోలీసు బృందంపై కాల్పులు..
వాస్తవానికి అర్షద్ తన సహచరులతో కలిసి జింఝానా పోలీస్ స్టేషన్ ప్రాంతం గుండా వెళుతున్నట్లు STFకి రహస్య సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చుట్టుముట్టి ఆపడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో అర్షద్, అతని ముగ్గురు సహచరులు గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు ఇప్పుడు ఇతర వాంటెడ్ నేరస్థుల కోసం వెతకడం ప్రారంభించారు.
పోలీసుకు బుల్లెట్ గాయాలు..
ఈ ఎన్‌కౌంటర్ సమయంలో STF బృందానికి నాయకత్వం వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ సునీల్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను కర్నాల్‌లోని అమృతధార ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముస్తఫా కగ్గా ముఠా సభ్యుడు అర్షద్‌తో పాటు మరో ముగ్గురు మంజీత్, సతీష్, గుర్తు తెలియని సహచరుడు గాయపడ్డారు. ఆ తరువాత ముగ్గురూ మరణించారు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం గురించి తెలుసా.. వెయ్యేళ్ల యాగాలకు సమానం..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News