Rekha Gupta Takes Oath: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:08 PM
Rekha Gupta Takes Oath: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. ఆ పార్టీకి కేవలం 22 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం స్థానిక రాం లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఆమె చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆ పార్టీ అగ్రనేతలే కాదు.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సైతం హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సైతం హాజరయ్యారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె.. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ దేవేంద్ర యాదవ్‌తో మాట్లాడుతోన్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాతోపాటు మీడియాలో వైరల్ అవుతోంది.
గతేడాది మే, జూన్ మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని.. ఆ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తీహాడ్ జైలులోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మేలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదలై.. ఇంటికి చేరుకున్నారు.
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
ఆ కొద్ది రోజులకు రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్.. సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే ఏమైందో ఏమో కానీ.. తనపై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు.. ఈ సమయంలో సీఎం కేజ్రీవాల్ తన నివాసంలోనే ఉన్నారని తెలిపారు. పార్టీకి చెందిన వివిధ అంశాలను చర్చించాలని.. అందుకోసం సీఎం కేజ్రీవాల్ నివాసానికి రావాలంటూ ఆయన పీఏ బిభవ్ కుమార్ తనను పిలిచారని ఎంపీ స్వాతి మలివాల్ తెలిపారు.
అనంతరం ఆమె ఢిల్లీ పోలీసులకు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. దీంతో బిభవ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన చోటు చేసుకున్న నాటి నుంచి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు, ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ మధ్య దూరం పెరిగింది. అనంతరం కేజ్రీవాల్‌పై పలు సందర్భాల్లో ఆమె తీవ్ర ఆరోపణలు సైతం గుప్పించిన విషయం విధితమే.
మరోవైపు.. గతేడాది అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. ఆ సమయంలో కేజ్రీవాల్‌కు స్వాతీ మాలివాల్ మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఒంటరిగా పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఆయన ద్రోహం చేశారని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో సైతం ఆప్ ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. యుమునా నదిలో నీటిని శుభ్రం చేస్తామంటూ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కేజ్రీవాల్ అమలు చేయలేదని స్వాతి మలివాల్ ఆరోపించారు.
ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆమె ఆందోళనకు దిగారు. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం చిత్రాన్ని ఆమె.. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.
అహంకారం వల్లే కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారని స్వాతీ మలివాల్ స్పష్టం చేశారు. ఇంకోవైపు.. కేజ్రీవాల్‌తో వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ పదవికి ఆమె రాజీనామా చేస్తారనే ఓ ప్రచారం అయితే సాగుతోంది. దీనిపై ఆమె స్పందించారు. తాను ఆప్ ఎంపీగానే కొనసాగుతానంటూ స్వాతీ మలివాస్ స్పష్టం చేశారు.
For National News And Telugu News