Share News

Actress Khushboo: నటి ఖుష్బూ అరెస్ట్.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:12 PM

అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై డీఎంకే(DMK) ప్రభుత్వం నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారతి నేతృత్వంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ఆధ్వర్యంలో మదురైలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు.

Actress Khushboo: నటి ఖుష్బూ అరెస్ట్.. విషయం ఏంటంటే..

- విద్యార్థినిపై అత్యాచారానికి నిరసనగా మదురైలో మహిళా మోర్చా ర్యాలీ

- ఖుష్బూ సహా పలువురి అరెస్టు

చెన్నై: అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై డీఎంకే(DMK) ప్రభుత్వం నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారతి నేతృత్వంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ఆధ్వర్యంలో మదురైలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. మదురై నుంచి చెన్నై వరకు ర్యాలీ చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసుల అనుమతి లేకుండా ఈ నిరసన జరుపటంతో ఖుష్బూ సహా అందరినీ అరెస్టు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Chittoor: పుత్తూరు- అత్తిపట్టు రైల్వే రూట్‌ మ్యాప్‌ సిద్ధం


nani8.2.jpg

మహిళా మోర్చా కార్యకర్తలు ఓ భారీ వ్యాన్‌లో బయలుదేరటానికి సిద్ధమయ్యారు. ఆ వ్యాన్‌ యాత్రకు ఖుష్బూ(Khushboo) జెండా ఊపి ప్రారంభించారు. అనుమతి లేకుండా జరిగిన ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మహిళా కానిస్టేబుళ్లు ఆందోళనలో పాల్గొన్న ఖుష్బూ, ఇతర మహిళా నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మందిని అరెస్టు చేసి వ్యాన్లలో తరలించారు.


nani8.3.jpg

స్టాలిన్‌ క్షమాపణ చెప్పాలి...

ఆందోళనలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఖుష్బూ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని చోట్లా మహిళలకు భద్రతలేకుండా పోయిందని, విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్టాలిన్‌ సారీ చెప్పేంత దాకా తమ పోరాటం ఆగదని కూడా ఆమె హెచ్చరించారు.


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 01:14 PM