Bank Gold Heist: రుణం ఇవ్వలేదని ఆ బ్యాంకుకే కన్నం
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:29 AM
రుణం తిరస్కరించడమేనన్న కారణంతో, ఓ వ్యక్తి తన ముఠాతో బ్యాంకు లాకర్లలో ఉన్న రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు. పోలీసుల దర్యాప్తుతో ఆ బంగారం స్వాధీనం అయింది

బెంగళూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రుణం అడిగితే ఇవ్వలేదన్న కక్షతో బ్యాంకుకే కన్నం వేశాడు ఓ దుండగుడు. ముఠాను ఏర్పాటు చేసుకుని, రూ.కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. దక్షిణ భారతదేశంలో సంచలనం రేపిన దావణగెరె జిల్లాలోని న్యామతి పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.95 కోట్ల విలువైన 17.750 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు విజయకుమార్ తమిళనాడువాసి. సోదరుడు అజయకుమార్‌తో కలసి కొన్నేళ్ల క్రితం న్యామతికి వలస వచ్చాడు. రుణం కోసం అతడు స్థానిక ఎస్‌బీఐ శాఖకు వెళ్లగా అధికారులు తిరస్కరించారు. దీంతో విజయకుమార్ తన తమ్ముడు అజయకుమార్, బావమరిది పరమానంద, న్యామతికే చెందిన చంద్రు, హొణ్ణళ్లికి చెందిన మంజునాథ్, అభిషేక్‌తో కలిసి పథకం వేశాడు. వారు 2024, అక్టోబరు 26న రాత్రి బ్యాంకు లాకర్లలోని 17.750 కేజీల బంగారాన్ని అపహరించారు. ఆ బంగారాన్ని తమిళనాడు మధురైలోని ఓ తోటలో పాడుపడిన బావిలో దాచారు. అయితే, పోలీసుల దర్యాప్తులో నిజం వెల్లడైంది. విజయకుమార్ ఇచ్చిన సమాచారంతో బావిలో దాచిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News