Share News

Delhi Elections 2025: బీజేపీ పెద్ద పొరపాటు చేసింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైర్

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:56 PM

మోహన్ సింగ్ బిష్ట్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థి దుర్గేష్ పాఠక్‌పై గెలుపొందారు. 1998లో ఒక్కసారి మినహా ఆయన పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. తాజాగా తనకు బదులు కరవల్ నగర్ సీటును కపిల్ మిశ్రాకు కేటాయించడంపై ఆయన పార్టీపై మండిపడ్డారు.

Delhi Elections 2025: బీజేపీ పెద్ద పొరపాటు చేసింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైర్

న్యూఢిల్లీ: బీజేపీ నేత కపిల్ మిశ్రా (Kapil Mishra)ను కరవల్ నగర్ (Karawal Nagar) నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ (Mohan Singh Bisht) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ''పార్టీ పెద్ద పొరపాటు చేసింది'' అని ఆయన వ్యాఖ్యానించారు. బిష్ట్ స్థానంలో కపిల్ మిశ్రాను కరవల్ నగర్ సీటుకు అభ్యర్థిగా బీజేపీ శనివారంనాడు ప్రకటించింది.

Ramesh Bidhuri: బీజేపీ సీఎం అభ్యర్థిత్వంపై కేజ్రీ వ్యాఖ్యలకు బిధూరి కౌంటర్


ఉన్న చోటే పోటీ.. 17లోగా నామినేషన్

మోహన్ సింగ్ బిష్ట్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థి దుర్గేష్ పాఠక్‌పై గెలుపొందారు. 1998లో ఒక్కసారి మినహా ఆయన పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. తాజాగా తనకు బదులు కరవల్ నగర్ సీటును కపిల్ మిశ్రాకు కేటాయించడంపై ఆయన పార్టీపై మండిపడ్డారు. ''మేము ఎక్కడ అభ్యర్థులను నిలబెట్టినా గెలిచి తీరుతామని బీజేపీ అనుకుంటోంది. ఇది చాలా పెద్ద పొరపాటు. బురారి, కరవల్ నగర్, ఘోండ, సీలంపూర్, గోకల్‌పురి, నంగ్ నగ్రి నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో కాలమే చెబుతుంది. నేను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదు. జనవరి 17వ తేదీకి ముందే కరవల్ నగర్ నుంచి పోటీకి నామినేషన్ వేస్తా'' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


బీజేపీ 29 మంది అభ్యర్థులతో రెండో జాబితాను శనివారంనాడు విడుదల చేసింది. ఆప్ మాజీ నేత కపిల్ మిశ్రాను కరవల్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈ జాబితాలో ప్రకటించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా తనయుడు హరీష్ ఖురానాను మోతీ నగర్ నియోజకవర్గం నుంచి నిలబెట్టింది. తాజా జాబితాలో ఇంతవరకూ 58 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 12 , 2025 | 06:56 PM