Share News

Delhi Assembly Elections: హస్తిన పీఠం కోసం .. బీజేపీ స్కెచ్

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:04 PM

దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల్లో వరుసా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది. అయితే ఆప్ పాలనకు గండి కొట్టి.. అధికార పీఠాన్ని అందుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Delhi Assembly Elections: హస్తిన పీఠం కోసం .. బీజేపీ స్కెచ్
BJP Chief JP Nadda

న్యూఢిల్లీ, జనవరి 09: డిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. ఆ క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా పార్టీ సందేశాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో ఈ రోజు.. అంటే గురువారం సాయంత్రం 4.00 గంటలకు ఢిల్లీ ఎన్నికల కోసం.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. పార్టీ గెలుపు వ్యూహాలపై వారితో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరమై రెండు దశాబ్దాలు దాటింది. నాటి నుంచి ఢిల్లీలో అధికారం అందుకోవాలని ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకొంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందుకొన్న ఆప్.. మరో సారి అంటే ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందుకోసం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తన పరివారంతో తనదైన శైలీలో ఆయన ముందుకు వెళ్తున్నారు.


అదీకాక.. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తదితరులను వరుసగా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే తన ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. కానీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన పదవికి రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ గట్టిగా డిమాండ్ చేసింది.

Also Read: ప్రధాని మోదీ పర్యటన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు


కానీ ఆయన తన సీఎం పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. కేజ్రీవాల్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కేబినెట్‌లోని మంత్రి అతిషిని ఏకగ్రీవంగా ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు.

Also Read: జీహెచ్ఎంసీ ఎదుట మెరుపు ధర్నా.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం


అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. ముఖ్యమంత్రిగా మరోసారి తాను బాధ్యతలు చేపట్టడం ద్వారా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన నిర్ధోషత్వాన్ని నిరూపించుకొంటానని కేజ్రీవాల్.. తన రాజీనామా చేసే సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొంటానని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వేళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పకడ్బందీగా వ్యూహా రచన చేస్తోంది.


గతేడాది మే, జూన్ మాసాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఢిల్లీ ఓటరు పట్టం కట్టనున్నాడు అనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆగాల్సి ఉందన్నది సుస్పష్టం. నూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

For National News And Telugu News

Updated Date - Jan 09 , 2025 | 05:17 PM