Share News

Delhi Assembly Elction: 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

ABN , Publish Date - Jan 15 , 2025 | 07:48 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఢిల్లీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.

Delhi Assembly Elction: 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను (Delhi Assembly Elections) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ (BJP) ఎన్నికల ప్రచార బరిలోకి హేమాహేమీలను దింపుతోంది. పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందితో కూడిన జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఈజాబితాలో ఉన్నారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 'ఖలిస్థానీ' ముప్పు.. ఇంటెలిజెన్స్ సమాచారం


కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి, మనోహర్‌లాల్ ఖట్టార్, ధర్మేంద్ర ప్రధాన్, సర్దార్ హర్దీప్ సింగ్ పురి, గిరిరాజ్ సింగ్, బీజేపీ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవిస్, హిమంత బిశ్వ శర్మ, మోహన్ యాదవ్, పుష్కర్ సింగ్ ధామి, భజన్‌లాల్ శర్మ, నయబ్ సింగ్ సైని ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. ఇతర ప్రచారకర్తల్లో వీరేంద్ర సచ్‌దేవ, బైజయంత్ జే పాండ, అతుల్ గార్గ్, డాక్టర్ అక్లా గుర్జార్, హర్ష్ మల్హోత్రా, కేశవ్ ప్రసాద్ మౌర్య, ప్రేమ్ చంద్ బైర్వా, సమ్రాట్ చౌదరి, డాక్టర్ హర్షవర్దన్, హన్స్ రాజ్ హన్స్, మనోజ్ తివారి, రామ్‌వీర్ సింగ్ బిధూడీ, యోగేంద్ర చాందోలియా, కమల్‌జీత్ షెరావత్, ప్రవీణ్ ఖండేల్వాల్, బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, హేమమాలిని, రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్, సర్దార్ రాజా ఇక్బాల్ సింగ్ ఉన్నారు.


త్రిముఖ పోటీ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార హోరు పెరుగుతోంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. 'ఆప్' ముందుగానే 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, బీజేపీ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. జనవరి 17వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండగా, ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 15 , 2025 | 07:48 PM