Delhi Elections: వచ్చింది చిన్న కారులో, నివసించింది ప్యాలెస్‌లో.. కేజ్రీపై రాహుల్ పంచ్‌లు
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:53 PM
పేద ప్రజలను ఆదుకోవాల్సిన వచ్చినప్పుడు, ఢిల్లీలో హింసాకాండ జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు కనిపించకుండా ముఖం చాటేశారని రాహుల్ గాంధీ విమర్శించారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు రావడంతో ప్రధాన పార్టీల నేతలంతా ప్రత్యర్థి పార్టీలపై విమర్శల జోరు పెంచారు. 'శీష్ మహల్' అంశంతో కేజ్రీవాల్‌ను గుక్కతిప్పుకోకుండా విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ తరహాలోనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం మంగళవారం ఎన్నికల ప్రచార సభలో కేజ్రీవాల్ విలాసవంతమైన 'అద్డాలమేడ'పై పంచ్‌లు విసిరారు. చిన్న కారులో వచ్చి శీష్ మహల్‌లో జీవనం సాగించారంటూ విమర్శించారు.
Sam Pitroda: ఎన్నికల వేళ శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్
ఢిల్లీకి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేజ్రీవాల్ నీలిరంగు వ్యాగన్ ఆర్ ఉండేది. ఆ విషయాన్ని రాహుల్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, అరవింద్ కేజ్రీవాల్ తాను భిన్నమైన రాజకీయాలు చేస్తుంటానని చెబుతుంటారని, ఆయన మొదట చిన్న కారులో వచ్చారని, ఆ తర్వాత విలాసవంతమైన శీష్‌మహల్‌లో ఉన్నారని అన్నారు. పేద ప్రజలను ఆదుకోవాల్సిన వచ్చినప్పుడు, ఢిల్లీలో హింసాకాండ జరిగినప్పుడు ఆయన ప్రజలకు కనిపించకుండా ముఖం చాటేశారని విమర్శించారు.
లిక్కర్ స్కామ్‌పై..
లిక్కర్ కుంభకోణంపై కూడా కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రతాప్ గంజ్ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్ రూపకర్త అని, కేజ్రీవాల్‌తో కలిసి దీన్ని రూపొంచారని ఆరోపించారు. ఆ కారణంగానే సిసోడియా తన సొంత నియోజకవర్గం నుంచి పారిపోయారని అన్నారు. సిసోడియా ప్రస్తుతం జాంగ్ పుర నియోజకవర్గం నుంటి పోటీలో ఉన్నారు. భిన్నమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకున్న కేజ్రీవాల్ ఢిల్లీకి అతిపెద్ద లిక్కర్ స్కామ్‌ను ఇచ్చారని రాహుల్ ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీ నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ తరఫున రాహుల్ మంగళవారంనాడు ప్రచారం సాగించారు. ఈ నియోజకవర్గం నుంచే కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..
Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..
Read More National News and Latest Telugu News