Share News

Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసును క్లోజ్ చేసిన సీబీఐ.. మాజీ ప్రియురాలి పాత్రపై ఏం తేల్చారంటే..

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:38 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో..

Sushant Singh Rajput: సుశాంత్ మృతి కేసును క్లోజ్ చేసిన సీబీఐ.. మాజీ ప్రియురాలి పాత్రపై ఏం తేల్చారంటే..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు కొన్నేళ్లుగా పెద్ద మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో ఇన్నాళ్లూ నిందితురాలిగా ఉన్న సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా నిర్దోషి అని కోర్టు తీర్చు ఇచ్చింది. దీంతో రియాకు ఉపశమనం లభించినట్లయింది.


బాలీవుడ్‌లో స్వయం కృషితో పైకి వచ్చి హేమాహేమీలకు గట్టి పోటీ ఇచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput).. 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సుశాంత్ మరణం (Sushant Death) బాలీవుడ్ మాత్రమే కాకుండా భారతీయ చిత్రపరిశ్రమలో సైతం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కేసులో అనేక అనుమానాలు రేకెత్తడమే ఇందుకు కారణం. తమ కొడుకు ఆత్మచేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో కావాలనే హత్య చేశారని సుశాంత్ తల్లిందండ్రులు ఆరోపించారు. దీనికితోడు ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు కూడా తెరపైకి వచ్చింది. సుశాంత్ అకౌంట్ నుంచి రియా కుటుంబ సభ్యులు రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారనే ఆరోపణలు రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. దీంతొ చివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది.


సుశాంత్ కేసులో మాదక ద్రవ్యాల అంశం తెరమీదకు రావడం కూడా మరింత సంచలనాలకు కారణమైంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు కలిసి సుశాంత్‌కు మాదక ద్రవ్యాలు ఇచ్చేవారంటూ కూడా ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో రియాతో పాటూ ఆమె సోదరుడు కూడా కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసుపై సుమారు నాలుగేళ్లకు పైగా విచారణ సాగించిన సీబీఐ (CBI).. ఇటీవల దర్యాప్తును క్లోజ్ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 22న ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్ట్ కూడా దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చింది. అలాగే నటి రియా చక్రవర్తికి ఇందులో ఎలాంటి సబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చింది. ఇన్నేళ్లూ సంచలనంగా మారిన సుశాంత్ కేసులో.. సీబీఐ విచారణను ముగిచడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ దీనిపై సుశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Mar 23 , 2025 | 11:42 AM