Share News

Chhattisgarh: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:54 PM

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రత బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులను భద్రత బలగాలు గుర్తించాయి.

Chhattisgarh: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి

ఛత్తీస్‌గఢ్, జనవరి 01: ఛత్తీస్‌గఢ్‌లో భద్రత బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రత బలగాలే లక్ష్యంగా ఐ.ఈ.డీ బాంబులను మావోయిస్టులు అమర్చారు. రహదారిపై తనిఖీల్లో భాగంగా వాటిని భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ వెంటనే భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. ఆయా బాంబులను నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఐ.ఈ.డీ బాంబులు.. మూడు కేజీలు బరువు ఉన్నాయని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.

మరోవైపు దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆయా వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం రాయ్‌పూర్‌లో వివరించారు. ఈ ఒక్క ఏడాది.. 2024లో బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య 121 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. వాటిలో 217 మంది తీవ్రవాదులు మరణించారు.


ఇక గత ఐదు సంవత్సరాల్లో హతమైన మావోయిస్టుల్లో 57 మంది అగ్రనేతలు ఉన్నారన్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న వామపక్ష తీవ్రవాద చరిత్రలో ఈ ఏడాది బస్తర్‌లో అత్యధికంగా సీనియర్ మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. ఇక మరణించిన మావోయిస్టు అగ్రనేతల్లో.. ఆరుగురు ప్రత్యేక జోనల్ కమిటీ (ఎస్‌జెడ్‌సి) సభ్యులు, నక్సల్స్‌కు సంబంధించిన వివిధ రాష్ట్ర కమిటీల సభ్యులు, 16 మంది డివిజనల్ కమిటీ (డివిసి) సభ్యులు, 32 మంది ఏరియా కమిటీ సభ్యులు, ఒక కంపెనీ డిప్యూటీ కమాండర్, ఇద్దరు ప్లాటూన్ కమాండర్లు ఉన్నారన్నారు.

Also Read: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ

Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం


ఈ ఏడాది 925 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా... ఒక్క బస్తర్‌లోనే 792 మంది తీవ్రవాదులు లొంగిపోయారన్నారు. అలాగే ఈ ప్రాంతంలో 284 ఆయుధాలతోపాటు 311 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమగ్రమైన వ్యూహా రచనతో 2024లో బస్తర్‌లో అత్యధికంగా.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలను నిర్వీర్యం చేశాయని పోలీస్ ఉన్నతాధికారి సోదాహరణా వివరించారు. ఇక హతమైన మావోయిస్టు అగ్రనేతల తలలపై రూ. 4.62 కోట్ల రివార్డు ఉందని గుర్తు చేశారు.

For National News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 04:54 PM