Birthday: వారం ముందే సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకలు..
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:49 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మార్చి 1న 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వారం రోజులకు ముందే డీఎంకే శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు.

- ఐదు నియోజకవర్గాల్లో యేడాది పొడవునా అల్పాహారం
- ప్రారంభించిన దుర్గాస్టాలిన్
చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మార్చి 1న 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వారం రోజులకు ముందే డీఎంకే శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఆ పార్టీ చెన్నై ఈస్ట్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ‘అన్నం తరుమ్ అముదకరంగళ్’ (అన్నదానం చేసే అమృతహస్తాలు) పేరుతో అల్పాహార పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి సతీమణి దుర్గాస్టాలిన్ ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Principal Secretary: పదేళ్లు పొరంబోకు స్థలంలో నివసిస్తే పట్టా..
కొళత్తూరు అగరం, జగన్నాధన్ రోడ్డులోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో పార్టీ జిల్లా నేత, దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ పథకాన్ని ఆమె అట్టహాసంగా ప్రారంభించారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 19 వరకూ యేడాది పొడవునా హార్బర్, తిరువిక నగర్, అంబత్తూరు, విల్లివాక్కం, ఎగ్మూరు శాసనసభ నియోజకవర్గాల్లో రోజుకో ప్రాంతం చొప్పున ఉదయం పూట వెయ్యి మందికి అల్పాహారం పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, నార్త్‌చెన్నై ఎంపీ డాక్టర్ కళానిధి వీరాసామి, ఎమ్మెల్యేలు తాయగం కవి, వెట్రి అళగన్, జోసెఫ్ సామువేల్, కార్పొరేషన్ జోనల్ కమిటీ నేతలు సరితా మహే్‌షకుమార్, కేపీ జైన్, పీకే మూర్తి, పట్టణ పంచాయతీ సభ్యులు ఐసీఎఫ్ మురళీధరన్, చంద్రు, మహే్‌షకుమార్, కార్పొరేటర్లు నాగరాజన్, దావూద్‌బీ, యోగప్రియా, శ్రీధని, అముదా, శారద, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News