Flight Delays: 7 రోజులు ఎయిర్ పోర్ట్ బంద్.. 1,300కు పైగా విమానాలపై ప్రభావం
ABN , Publish Date - Jan 08 , 2025 | 08:13 PM
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ విమానాశ్రయాన్ని కొన్ని గంటపాటు వారం రోజులు మూసివేయనున్నారు. దీంతో 1,300కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుందని ఓ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ గుండా ప్రయాణించే విమాన ప్రయాణికులకు (Delhi Airport) కీలక అలర్ట్ వచ్చేసింది. అది ఏంటంటే రిపబ్లిక్ డే వేడుకల కోసం భద్రతా కారణాల దృష్ట్యా నోటామ్ ఢిల్లీ విమానాశ్రయం రన్‌వే జనవరి 19 నుంచి జనవరి 26 వరకు ప్రతిరోజూ 145 నిమిషాల పాటు మూసివేయబడుతుంది. ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు రిహార్సల్స్, రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వారం రోజులపాటు మధ్యాహ్నం వరకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రన్‌వే మూసివేస్తే 1,300 కంటే ఎక్కువ విమానాలకు అంతరాయం (Flight Delays) కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
విమాన ప్రయాణంపై ప్రభావం
ఈ నేపథ్యంలో విమానయాన పరిశోధన సంస్థ సిరియమ్ ప్రకారం 1,336 విమానాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. వాటిలో 665 బయలుదేరేవి కాగా, 671 రాకపోకలు సాగించేవన్నారు. దీంతోపాటు టొరంటో, వాషింగ్టన్, తాష్కెంట్, కొలంబో వంటి గమ్యస్థానాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలు కూడా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని విమానాలు పూర్తిగా రద్దు కాకుండా రీషెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇటివల ఢిల్లీలో పొగమంచు గరిష్ట స్థాయికి చేరుకున్న కారణంగా వందల సంఖ్యలో విమానాలు ఆలస్యం అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రయాణికులకు సూచన
ఈ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చే, ఢిల్లీ నుంచి బయలుదేరే ప్రయాణీకులు ప్రయాణించే ముందు విమాన మార్పుల సమాచారం గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అప్‌డేట్‌ల కోసం మీ ఎయిర్‌లైన్ ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు. వీలైతే పరిమిత గంటల తర్వాత విమానాలను రీబుక్ చేసుకోవాలని అంటున్నారు. రద్దు చేసిన సందర్భంలో విమానయాన సంస్థలు సాధారణంగా ప్రత్యామ్నాయ విమానాలు లేదా వాపసులను అందిస్తాయి. చివరి నిమిషంలో మళ్లీ నమోదు చేసుకోవాలి. ఈ క్రమంలో అధిక ఖర్చులకు సిద్ధంగా ఉండాలని కూడా పలు సంస్థలు చెబుతున్నాయి.
ఢిల్లీ, ముంబయిలో కూడా..
విమానయాన సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలతో సమన్వయం చేస్తున్నందున షెడ్యూల్ మార్పులు, విమాన రద్దు వంటి కార్యకలాపాల (IRROPS) గురించి నివేదికలను పంపిస్తుంది. అయినప్పటికీ ఢిల్లీలో దాదాపు పూర్తి సామర్థ్యంతో పాటు ముంబై విమానాశ్రయంలో పరిమితుల కారణంగా విమానాల రీషెడ్యూల్ వంటి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలను ముందుగా ప్రకటించడం వలన ఆయా విమానయాన సంస్థలు, ప్రయాణీకులు మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఎప్పటికప్పుడూ...
ఢిల్లీ తనను తాను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నందున, ఇలాంటి వార్షిక కార్యక్రమాలను సజావుగా నిర్వహించడం అధికారులకు, విమానయాన సంస్థలకు ఇప్పుడు సవాలుగా మారుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రయాణికులు విమాన షెడ్యూళ్లలో చేసిన అప్‌డేట్‌లను నిశితంగా గమనించాలని అధికారులు కోరారు. ఇంకా బుక్ చేసుకోని వారు అంతరాయాన్ని తగ్గించడానికి నిషేధిత సమయాల్లో విమానాలను నివారించాలన్నారు.
ఇవి కూడా చదవండి:
SNACC: 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. మార్కెట్లోకి కొత్త యాప్..
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Read Latest National News and Telugu News