Share News

Delhi Assembly Elections: కేజ్రీవాల్ నామినేషన్

ABN , Publish Date - Jan 15 , 2025 | 02:43 PM

కేజ్రీవాల్ తన భార్య, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాని వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి ముందు కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Delhi Assembly Elections: కేజ్రీవాల్ నామినేషన్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elctions) నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 'ఆప్' జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఆప్ పనితీరుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేజ్రీవాల్ తన భార్య, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాని వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి ముందు కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు.

Rahul Gandhi: ఆయనకు త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు: రాహుల్


నామినేషన్‌కు ముందు కేజ్రీవాల్ ఆ విషయాన్ని ఒక ట్వీట్‌లో తెలియజేశారు. ''ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. ఢిల్లీలోని తల్లులు, సోదరీమణులు నన్ను ఆశీర్వదిస్తూ నాతో కలిసి వస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు వాల్మీకి మందిరం, హనుమాన్ ఆలయం దర్శించి ఆశీస్సులు తీసుకుంటున్నాను'' అని తెలిపారు.


రమేష్ బిధూరి, పర్వేష్ వర్మ నామినేషన్

కాగా, కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి బుధవారం నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి, పార్టీ నేత హర్దీప్ సింగ్ పురి ఈ కార్యక్రమానికి హజరయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న పర్వేష్ వర్మ సైతం నామినేషన్ వేశారు. జనవరి 17వ తేదీతో నామినేషన్ల పర్వం ముగియనుంది. 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జనవరి 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకేవిడతలో పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 15 , 2025 | 02:43 PM