Delhi Elections: ఎన్నికలకు మందే కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర.. సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 24 , 2025 | 02:48 PM
కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) సంచలన ఆరోపణ చేశారు. ఈ కుట్రలో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారని, ఒకరు బీజేపీ కార్యకర్త అని, మరొక ప్లేయర్ ఢిల్లీ పోలీసులని ఆమె తెలిపారు.
Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..
శుక్రవారంనాడిక్కడ మీడియాతో అతిషి మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్‌పై వరుస దాడులకు సంబంధించి ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఈ దాడులపై ఆడిట్ రిపోర్ట్ కోరామని చెప్పారు. మాజీ సీఎంపై జరుగుతున్న వరుస దాడులపై తమ పార్టీ విచారణ జరపగా బీజేపీ కార్యకర్త ఒకరు ఈ దాడికి పాల్పడినట్టు తెలిసిందని వెల్లడించారు.
కేజ్రీవాల్‌పై హరి నగర్‌లో జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడుతూ, దుండగులు కేజ్రీవాల్ కారు వద్దకు చేరుకున్నప్పుడు ఢిల్లీ పోలీసులను వారిని అడ్డుకోలేదని చెప్పారు. దుండగులు కలిబరి వద్ద రాళ్లు, కర్రలతో వచ్చినప్పటికీ పోలీసులు చూస్తూ నిలబడిపోయారని తెలిపారు. కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. కేజ్రీవాల్‌కు జడ్ ప్లస్ క్యాటగిరి ఉందని బీజేపీ, పోలీసులు చేస్తు్న్న వాదనపై అతిషి నిలదీశారు. దేశ చరిత్రలో జడ్ ప్లస్ క్యాటగిరిలో ఉన్న వ్యక్తి కారుపై రాళ్లతో దాడి జరగడం, పోలీసులు ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు బీజేపీ, అమిత్‌షా అధీనంలో ఉండటమే కారణమన్నారు. కేజ్రీవాల్‌ను అంతం చేయడమే బీజేపీ, అమిత్‌షా ఏకైక లక్ష్యంగా ఉందంటూ ఘాటు ఆరోపణలు చేశారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News