Rekha Gupta: మోదీకి కృతజ్ఞతలు: రేఖా గుప్తా తొలి స్పందన
ABN , Publish Date - Feb 19 , 2025 | 09:14 PM
తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అగ్రనాయకత్వానికి, లెజిస్లేచర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేఖా గుప్తా (Rekha Gupta) తొలిసారి స్పందించారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అగ్రనాయకత్వానికి, లెజిస్లేచర్ పార్టీకి ధన్యవాదులు తెలియజేశారు. ఢిల్లీ అభివృద్ధికి తాను సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమంలో 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.
విద్యార్థి నేత నుంచి సీఎం పీఠానికి రేఖా గుప్తా
అభినందనల వెల్లువ
ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టనున్నట్టు రేఖా గుప్తాకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. సీఎల్‌పీ నేతగా రేఖా గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికకావడం అభినందనీయమని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం, ఆయన కృషితో అభివృద్ధి భారత్‌లో అభివృద్ధి ఢిల్లీ సాకారమవుతుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. మహిళా నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ద్వారా బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకుందని పార్టీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పునకు అనుగుణంగా మహిళా సీఎంను ఎంపిక చేస్తూ బీజేపీ గొప్ప నిర్ణయం తీసుకుందని పార్టీ ఎంపీ మనోజ్ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి ఓటు వేసిన 50 శాతం మహిళలకు గర్వించేలా బీజేఎల్‌పీ సమావేశంలో రేఖాగుప్తాను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఖురానా తెలిపారు. ఇది చారిత్రక నిర్ణమని, ఏకగ్రీవంగా రేఖాగుప్తాను ఎన్నుకున్నామని, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలుసుకునేందుకు తామంతా వెళ్తున్నామని మరో ఎమ్మెల్యే కపిల్ మిశ్రా తెలిపారు.
అతిషి అభినందనలు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నిలుపుకొంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో అభివృద్ధి పనులకు తమ పార్టీ సపోర్ట్ ఉంటుందన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తుండటం సంతోషంగా ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.