Delhi Voter List: ఢిల్లీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన ఈసీ
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:20 PM
అప్‌డేట్ చేసిన జాబితా ప్రకారం దేశ రాజధానిలో 1,55,24,858 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 84,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) దగ్గరపడుతుండటంతో ఓటర్ల తుది జాబితా(voter list)ను ఢిల్లీ ఎన్నికల కమిషన్ సోమవారంనాడు విడుదల చేసింది. అప్‌డేట్ చేసిన జాబితా ప్రకారం దేశ రాజధానిలో 1,55,24,858 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 84,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబిజాలో లేనివారు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎంత మంది కొత్త ఓటర్లను చేర్చారు, ఎంతమంది పేర్లను తొలగించారనే వివరాలు తాజా ఓటర్ల తాబితాలో ఈసీ పొందుపరిచింది.
Delhi Assembly elections: మహిళలకు రూ.2.500.. ప్రకటించిన కాంగ్రెస్
కాగా, మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ఓటర్లను తొలిగించారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలను న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గత శనివారంనాడు తోసిపుచ్చారు. ఓట్ల తొలగింపును కోరిన అప్లికెంట్ల వివరాలను డీఈఓ ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను డీఈఓ తొలగించారని ఎంపీ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు. ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం పూర్తిగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ఉంటుందని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్నాయి. అయితే ఇంతవరకూ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించలేదు. ఢిల్లీలో వరుసగా 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి..
Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..
Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు
Read More National News and Latest Telugu News