Delhi Elections 2025: నిరుద్యోగ యువతకు రూ.8,500
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:14 PM
చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాది పాటు రూ.8,500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఈ పథకాన్ని ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ప్రధాన పార్టీల హామీల జోరు పెరుగుతోంది. నిరుద్యోగ యువతకు అండగా కాంగ్రెస్ (Congress) పార్టీ కొత్త హామీ ప్రకటించింది. నిరుద్యోగులకు 'యువ ఉడాన్ యోజన' (Yuva Udaan Yojana)ను ప్రకటించింది. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాది పాటు రూ.8,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ (Sachin Pilot) ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ పథకాన్ని ప్రకటించారు.
Arvind Kejriwal: ఆ పని చేస్తే నేను పోటీ చేయను.. అమిత్‌షాకు కేజ్రీ సవాల్
''ఒక కంపెనీ, ఫ్యాక్టరీ, సంస్థలో తమ నైపుణ్యాలను చూపించిన యువతకు మేము ఆర్థిక సాయం అందిస్తాం. వారు ఆయా కంపెనీల నుంచి ఈ సహాయం పొందుతారు. ఇంట్లో ఖాళీగా కూర్చునే వారికి ఉద్దేశించిన పథకం కాదిది. శిక్షణ పొందిన చోటే యువత స్థిరపడేందుకు, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ పథకాన్ని తెచ్చాం'' అని సచిన్ పైలట్ తెలిపారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన మూడో హామీ ఇది. దీనికి ముందు జనవరి 6న 'ప్యారీ దీదీ యోజన' పథకాన్ని ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపింది. జనవరి 8న 'జీవన్ రక్షా యోజన'ను ప్రకటించిది. ఈ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న ఒకే విడతలో జరుగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు
Read Latest National News and Telugu News