Delhi-NCR Earthquake : ఢిల్లీలో స్వల్ప భూకంపానికే బాంబు పేలినంత సౌండ్.. ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:59 PM
Delhi-NCR Earthquake : దేశరాజధాని సహా అనేక రాష్ట్రాలను సోమవారం ఉదయం భూకంపం కుదిపేసింది. మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రజలను భూ ప్రకంపనలతో పాటు బూమ్ అంటూ పెద్ద పెద్ద పేలుళ్లు హడలెత్తించాయి. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినా.. బూమ్ అంటూ తీవ్ర శబ్దాలు వెలువడటం వెనకగల కారణాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ గుర్తించింది.

Earth Quake Delhi : సోమవారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానాల్లో వివిధ స్థాయిల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్లలోంచి పరుగుల తీశారు. ఢిల్లీలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైనప్పటికీ.. బూమ్ అంటూ పెద్ద శబ్దం వినరావడంతో ప్రజలు భయాందోళనలతో హడలిపోయారు. ఇలా ఎందుకు జరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు పరిశీలించగా అసలు నిజం వెలుగులోకొచ్చింది.
New FASTag Rules: ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంప కేంద్రం ధౌలా కాన్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీకి దగ్గరలో దాదాపు 5 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించినట్లు అధికారిక ఆధారాలు లేవు. అయితే, భూకంపం సమయంలో ఢిల్లీ వాసులు కొన్ని సెకన్ల పాటు పెద్ద శబ్దాలు కూడా రావడంతో వణికిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అనేక చిన్న, తక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. 2015లో ఇక్కడ 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 5 లేదా 10 కిలోమీటర్ల లోతులో ఉద్భవించే నిస్సార భూకంపాలు సాధారణంగా లోతైన భూకంపాల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.
బూమ్ శబ్దం ఎందుకొస్తుందంటే?
భూకంపం సమయంలో వినిపించే బూమ్ అనే పేలుడు శబ్దాలు సాధారణంగా నిస్సార-కేంద్రీకృత (తక్కువ లోతులో భూకంప కేంద్రం ఉంటే) భూకంపాల సమయంలో సంభవిస్తాయి. US జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఇలాంటి భూకంపాల నుంచి వచ్చే అధిక-ఫ్రీక్వెన్సీ కంపనాలు భూమిని కుదిపేసి స్వల్పకాలిక భూకంప తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గాలిలో ప్రయాణించి ధ్వని తరంగాలుగా మారుతాయి. దీని అర్థం భూకంప కేంద్రం భూమికి దగ్గరగా ఉన్నందున ఎక్కువ శక్తి, ధ్వని ఉత్పత్తి అవుతాయి. కొన్ని సందర్భాల్లో భూకంప ప్రకంపనలు లేకపోయినా కేవలం ధ్వనిని మాత్రమే ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
ఢీల్లీలో భూకంపానికి కారణం..
ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) ప్రకారం ఢిల్లీ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న జోన్ IVలో ఉంది. ఈ ప్రాంతంలో సాధారణంగా 5 నుంచి 6 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి, అప్పుడప్పుడు 7 నుండి 8 తీవ్రతతో కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, భూకంప జోన్ అనేది కాలక్రమేణా మారే నిరంతర ప్రక్రియ. ఉత్తర భారతదేశంలో భూకంపాలు హిమాలయ ప్రాంతంలోని భారతదేశ భూ ఫలకం, యురేషియన్ ఫలకం ఢీకొనడం వల్ల సంభవిస్తాయి. ఈ ప్లేట్లు ఢీకొన్నప్పుడు అవి ఒత్తిడిలో ఉన్న స్ప్రింగ్ లాగా శక్తిని నిల్వ చేస్తాయి.ఈ ప్లేట్ల కదలికల్లో మార్పులు ఏర్పడితే ఆ శక్తి విడుదలై భూకంపానికి కారణమవుతుంది.
ఇవి కూడా చదవండి..
Nita Ambani : ప్రధాని మోదీ, భర్త అంబానీపై ప్రశ్న.. నీతా మాస్ రిప్లైకి వీక్షకుల హ్యాట్సాఫ్!
Delhi Chief Minster: గురువారం అట్టహాసంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం
Seema Haider: వామ్మో.. సీమా హైదర్ ఇంత సంపాదిస్తోందా..!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..