MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:48 PM
డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.

- కేంద్ర ప్రభుత్వ శాఖగా ఈడీ
- ఎంపీ కనిమొళి ధ్వజం
చెన్నై: కేంద్ర ప్రభుత్వ శాఖగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) పనిచేస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) ఆరోపించారు. టాస్మాక్ ప్రధాన కార్యాలయం, డిస్ట్రిలరీ కంపెనీలు, మాజీ అధికారుల ఇళ్లల్లో ఇటీవల మూడు రోజులు తనిఖీలు చేపట్టిన ఈడీ, టాస్మాక్‌లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: EPS: మా పథకాలకు కొత్త పేర్లు పెట్టి మసిపూసి మారేడుకాయ చేశారు.
ఈ నేఫథ్యంలో, నగరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కనిమొళిని టాస్మాక్ అవినీతిపై విలేఖరులు ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ... ఈడీ ఏ విధంగా పనిచేస్తోంది అనే విషయం ప్రజలందరికి తెలుసన్నారు. బీజేపీ(BJP) రహిత రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ శాఖలా ఈడీ పనిచేస్తోందని ఎంపీ కనిమొళి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News