Home » Kanimozhi
డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.
ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్‌ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్‌ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్(President Stalin) సహా సీనియర్ నేతలు చర్యలు చేపడుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ద్వయాన్ని చూస్తేనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) గజగజ వణికిపోతారని డీఎంకే మహిళా నేత, తూత్తుక్కుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి(Kanimozhi) అన్నారు.
కేంద్రంలోని బీజేపీ పాలకులు తెల్లదొరల్లాగా విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేసి దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావని మరో స్వాతంత్య్ర సంగ్రామమని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తామంటూ తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.
తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్న డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి(Kanimozhi) ఆస్తులు గత ఐదేళ్లలో 80 శాతం పెరిగాయి.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు.
ప్రధాని మోదీ రోజూ రాష్ట్రానికి వచ్చినా, ఇక్కడే ఇల్లు తీసుకొని బస చేసినా బీజేపీకి రాష్ట్రప్రజలు ఓటు వేయ్యరని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.
డీఎంకే నాశనాన్ని కోరుకున్నవారంతా పత్తాలేకుండా పోయారని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చారు. తిరునెల్వేలి బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ డీఎంకే అడ్రస్ లేకుండా పొతుందని చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు.