Tamilnadu Assembly Polls: ఢిల్లీలో పళనిస్వామి.. బీజేపీతో అన్నాడీఎంకే 'పొత్తు'పొడుపు
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:52 PM
తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తమిళనాడులో పార్టీ బలం పెంచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నప్పటికీ డీఎంకేకు దీటైన పార్టీగా అన్నాడీఎంకే రెండవ బలమైన పార్టీగా ఉంది.

న్యూఢిల్లీ: మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీ మధ్య తిరిగి పొత్తు కుదరనుందా? అన్నాడీఎంకే నేతలు ఇరువురు ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో బీజేపీతో పొత్తు చర్చలు జరిగే అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కులసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
BJP Eid Kits: 'సౌగత్-ఏ-మోదీ' పేరుతో ముస్లింలకు బీజేపీ ఈద్ కిట్లు
తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తమిళనాడులో బలం పెంచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నప్పటికీ, డీఎంకేకు దీటైన పార్టీగా అన్నాడీఎంకే రెండవ బలమైన పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఉభయులకూ ప్రయోజనకరం కావచ్చనే అంచనాలు ఉన్నాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీకి కానీ, అన్నాడీఎంకేకు కానీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం మినహా మరో ఆప్షన్ లేదని అంటున్నారు. బీజేపీ సైతం ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తమిళనాడులో జూనియర్ పార్టనర్‌గా ఉండేందుకు సిద్ధంగానే ఉందని చెబుతున్నారు. అన్నాడీఎంకే కూడా తమకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గకుండా ఉంటే బీజేపీతో పొత్తుకు సముఖంగానే ఉందని అంటున్నారు.
2016లో తొలిసారి పొత్తు
మాజీ ముఖ్యమంత్రి జె.జయలిలత మరణాంతరం అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడటంతో తొలిసారి బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. అయితే 2019 ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. దీంతో 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమాయానికి ఎడప్పాడి పళనిస్వామి బీజేపీకి దూరంగా ఉన్నారు. సైద్ధాంతిక విబేదాలు, ముఖ్యంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వ్యవహారశైలితో అధికారికంగా 2023లో బీజేపీతో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంది. ఈ క్రమంలో ఈసారి నిర్దిష్ట షరతులతో బీజేపీతో పొత్తు విషయాన్ని పునరాలోచించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే అగ్రనేతగా పేరున్న పళనిస్వామి హస్తినలో ఉండటం, అమిత్‌షాను కలుసుకోనుండటంతో మళ్లీ రెండుపార్టీల మధ్య 'పొత్తు' పొడిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..