Hero Vijay: హీరో విజయ్ ధీమా.. అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:10 AM
1967, 1977సంవత్సరాల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావడం తథ్యమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Film actor Vijay) ధీమా వ్యక్తం చేశారు.

- 1967, 1977 పరిస్థితులు పునరావృతం తథ్యం
- టీవీకే వార్షికోత్సవ సభలో విజయ్ శపథం
చెన్నై: 1967, 1977సంవత్సరాల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావడం తథ్యమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Film actor Vijay) ధీమా వ్యక్తం చేశారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్దనున్న ఓ స్టార్‌హోటల్‌లో బుధవారం నిర్వహించిన పార్టీ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘రాజకీయాలంటేనే వేరే లెవల్. ఎవరు ఏ సమయంలో వ్యతిరేకిస్తారో, ఏ సమయంలో మద్దతిస్తారో ఎవరికీ అంతుచిక్కదు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber Fraud : ‘వీసీ’ డిజిటల్ అరెస్టు.. రూ.14 లక్షలు వసూలు
అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరని చెబుతుంటారు’ అని పేర్కొన్నారు. ఓ వైపు రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని చెబుతూనే మరో వైపు కాస్త ప్రజాదరణ కలిగిన వ్యక్తులు ఎవరైనా వస్తే కొందరికి కోపం తలకెక్కుతోందన్నారు. హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి తమ అవినీతి బండారం బయటపెడతాడేమోనని భయపడుతున్నారని డీఎంకేని పరోక్షంగా విమర్శించారు. తమ గుట్టు బయట పడకుండా ఉండాలంటే పార్టీ ప్రారంభించిన వాడిని తిట్టడమే మంచిదనుకుని వీడికెందుకు రాజకీయాలు అంటూ ఎద్దేవా చేయడం ప్రారంభించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఈ రీతిలోనే విమర్శిస్తున్నారన్నారు.
ఏడాదిపాటు సమర్థవంతంగా...
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని యేడాదిపాటు సమర్థవంతంగా నడిపించడం కూడా రికార్డేనన్నారు. పార్టీకి అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. పార్టీని మర్రిచెట్టులా పెంచాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే తాను పార్టీ కార్యవర్గాల ఏర్పాటులో తలమునకలయ్యానని చెప్పారు. త్వరలో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తానన్నారు.
గెలిపించేది యువతే...
పార్టీలో యువకులే అధికంగా ఉన్నారంటూ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారని, అన్నాదురై పార్టీని ప్రారంభించినప్పుడు, ఎంజీఆర్ పార్టీని ప్రారంభించినప్పుడు వారికి అండగా నిలిచి గెలిపించింది యువకులేననే విషయం మరువకూడదన్నారు. ఆ దిశగా టీవీకే కూడా యువత అందించే గట్టి మద్దతుతో అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ధన సంపాదనపై దృష్టి సారిస్తున్న రాజకీయ పెత్తందార్లను తరిమికొట్టడమే తన పార్టీ ప్రధాన కర్తవ్యమన్నారు.
డీఎంకే కూటమిలో చీలికలు...
ఈ సభలో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్త ఆదవ్ అర్జునా మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపే డీఎంకే కూటమిలో చీలికలు ఏర్పడతాయని, ఎన్నికల్లో టీవీకే గెలిచి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం, విజయ్‌ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే దిశగా తీవ్రంగా పాటుపడటమే తన లక్ష్యమన్నారు.
విజయ్‌కి అండగా...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వానికి విజయ్ పార్టీ చరమగీతం పాడటం ఖాయమని, ఆయనకు రాజకీయ వ్యూహరచన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. విజయ్‌కి అండగా ఉండటమే తన ఆశయమని అన్నారు. ఇదిలా వుండగా ఈ వేడుకలకు హాజరైన మూడువేలమందికి రుచికరమైన శాఖాహార, మాంసాహార భోజనాలను వడ్డించారు. ఈ వేడుకలకు వచ్చిన నేతల వాహనాల రాకపోకల కారణంగా ఈసీఆర్ రోడ్డులో బుధవారం ఉదయం 10 నుండి 11 గంటల దాకా ట్రాఫిక్ స్తంభించింది.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News