Share News

HMPV: మరో వైరస్ కలకలం.. రోగులతో చైనా ఆసుపత్రులు కిటకిట.. భారత్ అలర్ట్

ABN , Publish Date - Jan 03 , 2025 | 08:03 PM

HMPV Virus: గతంలో ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మరణించారు. తాజాగా అదే తరహాలో చైనాలో మరోవైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో చైనాలోని ఆసుపత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతోన్నాయి.

HMPV: మరో వైరస్ కలకలం.. రోగులతో చైనా ఆసుపత్రులు కిటకిట.. భారత్ అలర్ట్
HMPV Virus

న్యూఢిల్లీ, జనవరి 03: చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఆ వైరస్ పేరు హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ). చైనాలో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో చైనా ఆసుపత్రలు..ఈ వైరస్ బాధితులతో కిటకిటలాడుతోన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి కేంద్రీకరించాలంటూ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ (NCDC)ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశించింది. శ్వాస కోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. మరోవైపు ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

ఇంతకీ ఈ వైరస్ లక్షణాలు ఏమిటంటే..?

ఫ్లూ, ఇతర శ్వాస కోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగా ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా ఉండడంతోపాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని వివరిస్తున్నారు. అయితే వైరస్ తీవ్రత అధికంగా ఉంటే.. బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చని చెబుతున్నారు. ఇక ఈ వైరస్ సోకితే.. వ్యాధి లక్షణాలు బయటపడడానికి మూడు నుంచి ఆరో రోజుల వ్యవధి పడుతుందని అంటున్నారు. కానీ ఈ వైరస్.. చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి లేని వారికి సోకే అవకాశమున్నట్లు పలు వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి.


ఈ వైరస్ వ్యాప్తి ఎలా అవుతుందంటే..?

దగ్గు తుమ్ముల వల్ల వెలువడే తుంపర్లు.

వైరస్ బారిన పడిన వ్యక్తులతో కలిసి ఉండడం.

వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకితే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

Also Read: మళ్లీ లండన్‌ ప్రయాణం.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

Also Read: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..


ఇలా నివారించ వచ్చు..

సబ్బుతో 20 సెకండ్లు చేతులు శుభ్రంగా కడుక్కొవాలి.

శుభ్రం చేసుకొన్న చేతులతో ముఖాన్ని తాక కూడదు.

వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.

ఈ వైరస్ బారిన పడిన వారు.. దగ్గినా, తుమ్మినా.. నోరు, ముక్కు కవర్ చేసుకోవాలి. అనంతరం చేతులు శుభ్రం చేసుకోవాలి.

వైరస్ సోకిన వారి వస్తువులను ఇతరులు తాక కూడదు.

ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే.. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి.

Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్

Also Read: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?


2019, డిసెంబర్‌లో..

2019 చివరిలో వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మరణించారు. చైనాలోని వూహాన్ నగరంలోని ఓ ల్యాబ్‌లో ఈ వైరస్ పుట్టిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. మరో వైరస్.. అది కూడా మళ్లీ చైనాలో వ్యాపించడంతో.. ప్రభుత్వాలే కాదు.. ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

Also Read: ప్రశాంత్ కిషోర్‌‌కి పెరుగుతోన్న మద్దతు

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్

For National News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 08:27 PM