Devendra Fadnavis: మోదీకి నిజమైన వారసుడెవరంటే.. ఫడ్నవిస్ ఆసక్తికర సమాధానం
ABN , Publish Date - Jan 15 , 2025 | 09:31 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లులో గెలిపించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు మారుమోగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో పాటు మోదీ వారసత్వాన్ని కొనసాగించే అవవకాశం ఉన్న నేతల జాబితాలో ఫడ్నవిస్ పేరు కూడా వచ్చి చేరింది.
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా సత్తా చాటుతున్న నరేంద్ర మోదీ తరువాత ఆయన వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనే చర్చ అడపాదడపా రాజకీయ వర్గాల్లో జరుగుతుంటుంది. యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిస్వా శర్మ వంటి పేర్లు వినిపించిన సందర్భాలూ ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లులో గెలిపించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు మారుమోగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో పాటు మోదీ వారసత్వాన్ని కొనసాగించే అవవకాశం ఉన్న నేతల జాబితాలో ఫడ్నవిస్ పేరు కూడా వచ్చి చేరింది. దీనిపై ఫడ్నవిస్ ''జీ న్యూస్' ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 'ఖలిస్థానీ' ముప్పు.. ఇంటెలిజెన్స్ సమాచారం
మోదీ వారసత్వాన్ని అందుకునే అవకాశం ఉన్న వారిలో మీ పేరు కూడా వినిపిస్తోందని అన్నప్పుడు, తాను మోదీ 'ఐడియాలజీ'కి వారసుడని ఫడ్నవిస్ సమాధానమిచ్చారు. ''ఎవరి వారసుల జాబితాలోనూ నేను లేను. అయితే, ఏ సిద్ధాంతాలతో అయితే నరేంద్ర మోదీ పనిచేస్తున్నారో ఆ సిద్ధాంతాలకు నేను వారసుడిని. అందుకు కట్టుబడి ఉంటాను, ఆ సిద్ధాంతాలనే మునుముందు కూడా కొనసాగిస్తాను'' అని తెలిపారు.
కేంద్రానికి వెళ్లే అవకాశంపై..
కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తే అందుకు ఇష్టపడతారా అని అడిగినప్పుడు.. ''ఇప్పుడే నేను మహారాష్ట్ర సీఎం అయ్యాను. ఐదేళ్ల పాటు నన్ను ఇక్కడే ఉండనీయండి. మీరెందుకు నన్ను ఢిల్లీ పంపాలనుకుంటున్నారు?'' అని నవ్వుతూ ఫడ్నవిస్ సమాధానమిచ్చారు. 'ఏక్ హై తో సేఫ్ హై', 'బాటేంగే తో కటేంగే' నినాదాలపై అడిగినప్పుడు, వాటి అర్ధం ఆయా వ్యక్తులు అర్ధం చేసుకునే దానిపై ఉంటుందని, ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నదే ఆ నినాదాల ముఖ్యోద్దేశమని చెప్పారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం సునామీ తరహాలో అఖండ విజయం సాధించడానికి ''లాడ్లీ బెహన్ యోజన'' బాగా పనిచేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఫడ్నవిస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..
Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..
Read Latest National News and Telugu News