Share News

PM Modi: నేను కూడా శీష్ మహల్ కట్టగలను.. కేజ్రీపై మోదీ చురకలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 02:44 PM

దేశరాజధానిలోని 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కలను తాము సాకారం చేశామని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను కూడా 'శీష్ మహల్' కట్టగలనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: నేను కూడా శీష్ మహల్ కట్టగలను.. కేజ్రీపై మోదీ చురకలు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నిశిత విమర్శలు చేశారు. దేశరాజధానిలోని 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కలను తాము సాకారం చేశామని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను కూడా 'శీష్ మహల్' కట్టగలనని ప్రధాని అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కేజ్రీవాల్ నివసించిన విలాసవంతమైన భవనం 'శీష్ మహల్' కొద్దికాలంగా వార్తల్లో ప్రముఖంగా ఉంది.

Maharashtra: బాబాయ్‌,అబ్బాయ్‌ మధ్య సయోధ్య!


అశోక్ విహార్ రామ్‌లీలా గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశం ఈరోజు రాజకీయ, ఆర్థిక సుస్థిరతకు ఒక నిదర్శనంగా నిలిచిందని, 2025లోనూ ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం మరింత బలపడనుందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఈ ఏడాది భారతదేశం నిలువనుందని అన్నారు. ఈరోజు ఢిల్లీకి గుర్తుండిపోయే రోజని, గృహ, మౌలిక వసతుల, విద్యారంగాల్లో గుణాత్మక మార్పులు తెచ్చే ప్రాజెక్టులతో సిటీ అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.


''ఈ రోజు ఇక్కడకు వచ్చినప్పుడు ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా యావద్దేశం పోరాడుతున్నప్పుడు నాలాంటి ఎందరో అజ్ఞాతంలో ఉండి ఉద్యమించారు. ఇదే అశోక్ విహార్‌లో జీవనం సాగించాను'' అని మోదీ తెలిపారు. దీనికి ముందు రూ.4500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్‌లో ఇన్-సిటు స్లమ్ రిహాబిలేషన్ ప్రాజెక్టు కింద మురికివాడల కోసం నిర్మించిన కొత్త ఫ్లాట్‌లను ప్రధాని సందర్శించారు.


ఇవి కూడా చదవండి..

CT Ravi: సువర్ణసౌధ ఘటనపై సీటీ రవి ఆగ్రహం

Flights Delayed: ప్రయాణికులకు అలర్ట్.. దాదాపు 200 విమానాలు ఆలస్యం, రద్దు

For National News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 02:44 PM