MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:26 PM
నా రాజకీయ జీవితంలొ ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు బీఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో బీజేపీ సభ్యులు సభకు భంగం కలిగించడం దారుణమన్నారు.

- స్పీకర్‌కు గౌరవం ఇవ్వని బీజేపీ నాయకులు
- సభకు భంగం కలిగించడం దారుణం
- ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆవేదన
బెంగళూరు: శాసనసభలో గందరగోళాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు బీఆర్ పాటిల్(BR Patil) పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్‌పై బీజేపీ సభ్యులు కాగితాలు విసిరారు. దీంతో స్పీకర్ పదినిమిషాలపాటు సభను వాయిదా వేశారు. ఇదే సమయంలోనే శాసనసభ నుంచి మీడియాపాయింట్‌కు వచ్చిన ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మాట్లాడుతూ రాజీనామా చేస్తానన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: HeroVishal: హీరో విశాల్ చెల్లి భర్తపై సీబీఐ కేసు.. ఏం జరిగిందంటే..
సభలో ఇటువంటి గందరగోళ పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్పీకర్‌పై పేపర్లు వేయడం సరికాదన్నారు. ఇదే విషయమై సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మీడియాతో మాట్లాడుతూ బీఆర్ పాటిల్ తనకు మిత్రుడని, ఆయనతో పిలిపించి మాట్లాడుతానన్నారు. కాగా బీఆర్ పాటిల్ కాంగ్రెస్ సీనియర్ నేత కలబురగి జిల్లా అళంద నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే పలువురి మంత్రుల తీరును తప్పుబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరోసారి సీనియర్లంటే గౌరవం లేకుండా పోతోందని, హోదాలో ఉండదలచుకోలేదన్నారు. దీంతో ఆయనకు సీఎం రాజకీయ సలహాదారుడి హోదాను గత ఏడాది కల్పించారు. ఇటీవలే ఆ హోదా వలన కూడా ప్రత్యేకత ఏదీ లేదని తిరగబడ్డారు. దీంతో మరోసారి బీఆర్ పాటిల్‌కు సలహదారుడి నుంచి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News