Rahul Gandhi: విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ అధీనంలోకి వెళ్తే దేశం నాశనమే
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:42 PM
పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.

న్యూఢిల్లీ: విద్యావ్యవస్థ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధీనంలోకి వెళ్లిపోతే దేశం నాశనమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)అన్నారు. ఆయా పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' (INDIA) కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. నిరుద్యోగ సమస్య, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారంనాడు నిరసన తెలిపాయి.
Supreme Court Collegium: జస్టిస్ యశ్వంత్‌వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు.. సుప్రీం కొలీజియం సిఫారసు
రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''దేశ భవిష్యత్తు, విద్యా వ్యవస్థను ఒక సంస్థ నాశనం చేయాలని చూస్తోంది. ఆ సంస్థ పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. విద్యావ్యవస్థ వారి చేతుల్లోకి వెళ్తే దేశం నాశనమవుతుంది. ఎవరికీ ఉపాధి అవకాశాలు రావు'' అని అన్నారు. ఇండియన్ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లపై ఆర్ఎస్ఎస్ అధిపత్యం చెలాయిస్తోందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర యూనివర్శిటీల వీసీలను కూడా ఆర్ఎస్ఎస్ సిఫారసుతోనే నియమిస్తారని, దీనిని మనం ఆపాలని, ఈ విషయాలన్నీ విద్యార్థుల మందుకు విద్యార్థి సంఘాలు తీసుకువెళ్లాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం పార్లమెంటులో మహాకుంభ్ ప్రస్తావన చేశారని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి కూడా ఆయన మాట్లాడి ఉంటే బాగుండేదని రాహుల్ అన్నారు. విద్యా వ్యవస్థపై కూడా ఒక్క ముక్క మాట్లాడలేదని అన్నారు. దేశంలోని వనరులన్నింటినీ అదానీ, అంబానీలకు, సంస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్‌కు అప్పగించడమే వారి మోడల్ అని విమర్శించారు. గత నెలలో యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులరేషన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో డీఎంకే నిర్వహించిన నిరసన కార్యక్రమంలోనూ రాహుల్ పాల్గొన్నారు. యూనివర్శిటీలు, కాలేజీల్లో టీచర్లు, సిబ్బంది నియామకాలకు సంబంధించిన యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ కేవలం ఒకే చరిత్ర, ఒకే సంప్రదాయం, ఒకే భాషను బలవతంగా రుద్దాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..