Share News

Sandeep Dikshit: క్రెకెట్‌లో హ్యాట్రిక్‌లా ఆ ముగ్గురి ఓటమి ఖాయం

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:18 PM

అరవింద్ కేజ్రీవాల్ మాజీ అధికారిక నివాసంలో (శీష్ మహల్) మినీబార్ ఉందని సందీప్ దీక్షిత్ చెప్పారు. ఆ విషయం తెలిసి తాను షాక్‌కు గురయ్యానని, లిక్కర్ పాలసీ ఎందుకు తెచ్చారో అప్పుడు అర్ధమైందని అన్నారు.

Sandeep Dikshit: క్రెకెట్‌లో హ్యాట్రిక్‌లా ఆ ముగ్గురి ఓటమి ఖాయం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థిగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందీష్ దీక్షిత్ (Sandeep Dikshit) సంచలన జోస్యం చెప్పారు. క్రికెట్‌లో హ్యాట్రిక్‌లాగానే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, అతిషి, మనీష్ సిసోడియా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటవి చవిచూడనున్నారని అన్నారు.

Ramesh Bidhuri: ప్రియాంక బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే మా టార్గెట్

కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు టార్గెట్ కాదని, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ ముందున్న లక్ష్యమని సందీప్ దీక్షిత్ తెలిపారు. ''సిద్ధాంతాలు, విధానాలపైనే మా రాజకీయ పోరాటం ఉంటుంది. 2013-2014లో ప్రతి ఒక్కరూ ఢిల్లీ గ్లోబల్ సిటీ కాబోతోందని చెప్పారు. ప్రతి క్షణం అందుకోసం మేము కష్టపడ్డాం. కానీ గత పదేళ్లలో బీజేపీ చేతిలో ఎంసీడీ ఉంది. కనీసం రోడ్లపై ఉన్న చెత్తను కూడా తొలగించలేదు. గార్బేజ్ సిటీగా ఢిల్లీ మారింది. ఢిల్లీ నిర్మాణం కోసం గతంలో పాటుపడింది, మునుముందు కూడా ఇందుకోసం పనిచేసేది కాంగ్రెస్ మాత్రమే'' అని ఆయన చెప్పారు.


కేజ్రీవాల్ మాజీ రెసిడెన్స్‌లో 'మినీబార్'

అరవింద్ కేజ్రీవాల్ మాజీ అధికారిక నివాసంలో (శీష్ మహల్) మినీబార్ ఉందని సందీప్ దీక్షిత్ చెప్పారు. ఆ విషయం తెలిసి తాను షాక్‌కు గురయ్యానని, లిక్కర్ పాలసీ ఎందుకు తెచ్చారో అప్పుడు అర్ధమైందని అన్నారు. ప్రభుత్వ నివాసంలో ఎప్పుడైనా మినీబార్ ఉండటం మనం విన్నామా? ఇందువల్ల వచ్చే పరిణామాలేమిటో వాళ్లకు అర్ధం కాలేదు. క్రికెట్‌లో హ్యాట్రిక్‌లాగానే ఆ ముగ్గురూ (కేజ్రీవాల్, అతిషి, సోసిడియా) ఎన్నికల్లో ఓటమి చవిచూడబోతున్నారని సందీప్ దీక్షిత్ జోస్యం చెప్పారు.


ఇవి కూడా చదవండి:

PM Modi: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి

Maha Kumbh Mela 2025: ఈ జాతర కోసం 13,000 రైళ్లు.. ఈసారి 40 కోట్ల మంది వస్తారని..

Chatthisghar: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 05 , 2025 | 09:18 PM