Share News

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:17 PM

ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..
Arvind Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు (ఫిబ్రవరి 3) చివరి రోజు. ఈ క్రమంలో ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రాంతంలో చివరి రోజు ప్రచారం నిర్వహిస్తూ, ప్రత్యర్థి పార్టీలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ (Arvind Kejriwal) కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గూండాయిజం, విధ్వంసం జరుగుతోందని ఆప్ కన్వీనర్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద గూండా ఎవరనే ప్రశ్న అందరి మనసులో మెదులుతోందన్నారు.


జర్నలిస్టులపై దాడి

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మేము చూశామని ఆయన అన్నారు. మా కార్యకర్తలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలో దగ్గర్లో నిలబడి ఉన్న పోలీసులు అంతా గమనిస్తున్నారు, కానీ చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అయితే పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిన్న ఢిల్లీలో ఏడుగురు జర్నలిస్టులపై దాడి జరిగింది. వారి తలలకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఇదంతా పార్లమెంటుకు ఒక కిలోమీటరు దూరం, ఎన్నికల కమిషన్‌కు ఒక కిలోమీటరు దూరంలో జరిగిందన్నారు.


మనకు రెండు ఆప్షన్లు..

ఈ ఎన్నికల సమయంలో మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. మహిళా కార్యకర్తలను కూడా వదిలిపెట్టడం లేదని, వారి వాహనాలపై దాడి చేశారని ఆరోపించారు. ఇప్పుడు వారి గూండాయిజాన్ని ఓడించడానికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారని కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మనకు రెండు ఎంపికలు ఉన్నాయని, వాటిలో ఒకటి మంచి పార్టీ, మరొకటి గూండా పార్టీ అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.


ఆప్ ఆరోపణలు

అదే సమయంలో ఆప్ నాయకులు, కార్యకర్తలందరూ భగత్ సింగ్ జీ శిష్యులని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. అమిత్ షా, బీజేపీ గూండాల నుంచి ఢిల్లీని కాపాడటానికి ఆప్ కార్యకర్తలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. మేము గూండాలకు భయపడబోమని, చివరి శ్వాస వరకు, ఆప్ నాయకులు, కార్యకర్తలు గూండాయిజాన్ని ఎదుర్కొంటారని, ఢిల్లీ ప్రజలతో కలిసి ఎన్నికల్లో వారిని ఘోరంగా ఓడిస్తారని ఆప్ తెలిపింది. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.

అమిత్ షా వ్యాఖ్యలు..

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటివల ఆప్ సర్కారు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాలలో ఢిల్లీలో ఆప్ ఎలాంటి పని చేయలేదన్నారు. ఢిల్లీ కాలుష్యం, అవినీతి నుంచి విముక్తి పొందలేదన్నారు. యమునా నదిని శుభ్రం చేస్తానని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ నెరవేర్చలేదని, ఢిల్లీలో ఆప్ మద్యం దుకాణం తెరిచి భారీగా లూటీ చేసిందని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి:

Indian Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్టానికి రూపాయి.. ఎందుకంటే..



Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 03 , 2025 | 01:20 PM