Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:46 AM
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో మరోమారు అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో అందరూ పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో అక్కడ ఏర్పాటు చేసిన పలు టెంట్లు కాలిపోయాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
వరుస ప్రమాదాలు.. టెన్షన్ టెన్షన్!
కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇలాంటి ఘటనలు టెన్షన్ కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29వ తేదీన కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో 30కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60 మంది గాయపడ్డారని సమాచారం. తాజాగా శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుంభమేళా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఇది నాలుగోసారి. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం కోట్లలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కోరుతున్నారు.
ఇవీ చదవండి:
‘అన్న యోజన’లో అనర్హుల ఏరివేతకు ఐటీ డేటా
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి