Share News

Siddaramaiah: సీఎం సీటు ఖాళీగా లేదు

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:42 PM

సీఎం మార్పు జరుగనుందంటూ వస్తున్న ఊహాగానాలపై సూర్జేవాలా సైతం స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ఉందని, సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ తీసుకుంటారని చెప్పారు.

Siddaramaiah: సీఎం సీటు ఖాళీగా లేదు

బెంగళూరు: ముఖ్యమంత్రి సీటు ఖాళీగా లేదని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) చెప్పారు. మీడియా ఎలాంటి వదంతుల జోలిగా పోకుండా నిజాలు రాయాలని సూచించారు. సీఎం మార్పు జరుగనుందంటూ జరుగుతున్న ఊహానాల నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వివరణ ఇచ్చారు.

PM Modi: కశ్మీర్‌లో జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని.. పాల్గొన్న నితిన్ గడ్కరీ, జమ్ము-కాశ్మీర్ సీఎం


''వదంతులకు ఆజ్యం పోయకుండా నిజాలను మాత్రమే మీడియా వెల్లడించాలి. సిద్ధారమయ్య సెలవుపై వెళ్తున్నారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. నిజం చెప్పాలంటే పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. అయినప్పటికీ ప్రతిరోజూ సీఎం మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం సీటు ఎంతమాత్రం ఖాళీగా లేదు" అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ లెజిస్టేర్ పార్టీ‌తో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రె కమిటీ (కేపీసీసీ) సభ్యుల సమావేశం సోమవారం జరుగుతోంది.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలే సైతం ఈ సమావేశానికి హాజరువుతున్నారు.


ఆయనే సీఎం: సూర్జేవాలా

సీఎం మార్పు జరుగనుందంటూ వస్తున్న ఊహాగానాలపై సూర్జేవాలా సైతం స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ఉందని, సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యమత్యంతో ఉందని, ఇచ్చిన హామీలను కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. బీజేపీ కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునందుకు కాంగ్రెస్ హామీలపై కట్టుకథలు అల్లుతూనే ఉందని, వాళ్లు దాడి చేస్తున్నది సీఎంపైనో, ఉపముఖ్యమంత్రి పైనో కాదని, కర్ణాటక ప్రజలమీదనేనిని అన్నారు. కాంగ్రెస్ హామీలపై బీజేపీ దుష్టపన్నాగాలను తిప్పికొడతామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 02:48 PM