Hero Darshan: గన్ లైసెన్స్ ఇవ్వండి ప్లీజ్..
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:22 AM
చిత్రదుర్గ రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ను కొనసాగించాలంటూ పోలీసులకు విన్నవించారు.

- ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్ కొనసాగించండి
- పోలీసులకు నటుడు దర్శన్ వినతి
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ను కొనసాగించాలంటూ పోలీసులకు విన్నవించారు. హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న దర్శన్‌ను అరెస్టు చేసిన పోలీసులు లైసన్స్ కలిగిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆయన గన్ లైసెన్సును రద్దు చేయాలని పోలీసులు నిర్ధారించారు. దర్శన్ జైలులో ఆరునెలల పాటు ఉండటంతో లైసెన్స్‌పై పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇటీవలే దర్శన్ బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: ఇక్కడ.. ఎనీటైం మందు గురూ..
దీంతో తుపాకీ ద్వారా సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందని, మీకు సంబంధించిన తుపాకీ లైసన్సును ఎందుకు రద్దు చేయరాదంటూ ఈనెల 7న పోలీసులు దర్శన్‌కు నోటీసులు జారీ చేశారు. అందుకు సమాధానంగా దర్శన్ సమగ్రంగా వివరణ ఇచ్చారు. తాను సినిమా నటుడు(Movie actor) అయినందున వెళ్ళిన ప్రతిచోటా ప్రజలు చేరుతారని ప్రైవేటు సెక్యూరిటీ ఉన్నా ఆత్మరక్షణకు లైసెన్సులు కావాలని రద్దు చేయకుండా పునరుద్దరించాలని వినతిలో కోరుకున్నారు. తుపాకీ లైసెన్స్ రద్దు అవుతుందా, లేదా అనేది నగర పోలీసు కమిషనర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News