Home » Renuka swami
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్(Actor Darshan)తోపాటు నిందితులు అందరూ కోర్టు ముందు హాజరయ్యారు. మంగళవారం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండడంతో అందరూ వచ్చారు.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) తుపాకీ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ను కొనసాగించాలంటూ పోలీసులకు విన్నవించారు.
త్రదుర్గ రేణుకా స్వామి(Renuka Swamy) హత్యకేసులో విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న మరో ఐదుగురికి బెయిల్ మంజూరైంది. బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో హత్యకేసును ఎదుర్కొంటున్న మొత్తం 17మంది బెయిల్‌పై బయటకు వచ్చినట్ట య్యింది.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు.
రేణుకాస్వామి(Renukaswamy) అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడుగా బళ్లారి జైల్లో ఉన్న కన్నడ సినీ హీరో దర్శన్(Kannada movie hero Darshan)కు మంగళవారం రాత్రి విమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్శన్ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు విమ్స్‌లో స్కానింగ్ పరీక్షలు చేశారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపపై చార్జ్‌షీట్ దాఖలయింది. రెండున్నర నెలలపాటు సాగిన కేసు మలుపులకు చార్జ్‌షీట్‌తో ఒక కొలిక్కి వచ్చింది.
నేర ప్రవృత్తితో దారుణాలకు పాల్పడినవారిని జైళ్లలోకి వేయడం సహజం. ఎంతటివారైనా అక్కడ కఠినమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. చేసిన తప్పునకు జైళ్లలో పశ్చాత్తాపం కలగాలనేది ముఖ్య ఉద్దేశ్యం. జైళ్ల శాఖలో కొందరి నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా జైళ్లు విలాసవంతమైన ప్రాంతాలుగా మారిపోతున్నాయి.
ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్‌కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జైలుపాలైన నటుడు దర్శన్(Actor Darshan)కు పరప్పన అగ్రహార జైలు(Parappana Agrahara Jail) భోజనమే కొనసాగుతుంది. ఇంటి భోజనం, పరుపు, దుస్తులు కోరుతూ దర్శన్ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను 24వ ఏసీఎంఎం కోర్టు కొట్టివేసింది. జైలు భోజనంతో అజీర్ణం, అతిసార అవుతోందని, శరీరం బరువు తగ్గుతున్నానని కారణాలు చూపుతూ ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసుకున్నారు.