Share News

Delhi Elections: బిలియనీర్ల గుప్పిట్లో దేశం.. కాంగ్రెస్ తొలి ర్యాలీలో రాహుల్

ABN , Publish Date - Jan 13 , 2025 | 09:40 PM

కాంగ్రెస్‌ను గెలిపిస్తే గతంలో ఢిల్లీని ఏవిధంగా అభివృద్ధి చేశామో ఆ విధంగా చేసి చూపిస్తామని, ఆ పని కేజ్రీవాల్ కానీ, బీజేపీ కానీ చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు.

Delhi Elections: బిలియనీర్ల గుప్పిట్లో దేశం.. కాంగ్రెస్ తొలి ర్యాలీలో రాహుల్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటు విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో మోదీ, కేజ్రీవాల్ విఫలమయ్యారని తప్పుపట్టారు. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరిందని, పేదవాళ్లు మరితం పేదలుగా మారుతుంటే, సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారని అన్నారు. ''ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారైనా అదానీ గురించి మాట్లాడటం మీరు చూశారా? బిలియనీర్ల దేశం మాకవసరం లేదు'' అని రాహుల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ సోమవారంనాడు శ్రీకారం చుడుతూ సీలాంపూర్ ప్రాంతంలో జరిగిన 'జై బాపు, జై భీం, జై సంవిధాన్' ర్యాలీలో పాల్గొన్నారు.

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్


రాజ్యాంగ విధ్యంసం, విద్వేష వ్యాప్తి

రాజ్యాంగాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తు్న్నాయని, విద్వేష వ్యాప్తి చేస్తు్న్నాయని రాహుల్ విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 4,000 కిలోమీటర్లు తాను ప్రయాణించానని చెప్పారు. ''డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగంపై మోదీ, బీజీపీ, ఆర్ఎస్ఎస్ ప్రతిరోజూ దాడి చేస్తూనే ఉన్నారు. దేశంలోని విద్వేశాన్ని జయించగలిగేది ఒక్క ప్రేమ మాత్రమే. తామేదైనా చేయగలమనే బిలియనీర్ల ఇండియా మాకు అవసరం లేదు. అంబానీ, అదానీ వంటి వారు దేశాన్ని కొనేసి, అన్ని వ్యాపారాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు'' అని రాహుల్ విమర్శించారు.


కేజ్రీవాల్ చేసిందేమిటి?

ఢిల్లీని పారిస్‌గా మారుస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ ప్రచారం చేశారనీ, కానీ కాలుష్యం పెరిగిందని, ద్రవ్యోల్బణం తారాస్థాయిలో ఉందని రాహుల్ అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్, కులగణనను కేజ్రీవాల్ కోరుకుంటున్నారా అని ప్రజలు ఆయనను ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే గతంలో ఢిల్లీని ఏవిధంగా అభివృద్ధి చేశామో ఆ విధంగా చేసి చూపిస్తామని, ఆ పని కేజ్రీవాల్ కానీ, బీజేపీ కానీ చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో 'ఇండియా'కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తు్న్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 09:40 PM