Republic Day: చెత్త తీసేసిన ప్రధాన నరేంద్ర మోదీ
ABN , Publish Date - Jan 26 , 2025 | 06:31 PM
రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ''స్వచ్ఛభారత్'' పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో దేశ 76వ గణతంత్ర వేడుకలు (Republic Day) ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి ''స్వచ్ఛభారత్'' (Swachh Bharat) పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
RepublicDay 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఏమన్నారంటే..
ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్‌ను మోదీ స్వాగతం పలికాల్సి ఉంది. ధన్‌ఖఢ్ వాహనాలు వస్తుండటం గమినించిన ప్రధాని ఆయనను రిసీవ్ చేసుకునేందుకు ఎంట్రన్స్ వైపు బయలుదేరారు. ఆ సమయంలో మోదీ కంటికి చెత్త కనిపించడంతో దాన్ని వెంటనే తీసివేసి.. పక్కనే ఉన్న తన భద్రతా సిబ్బంది చేతికి అందించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని మోదీ తన చర్యతో మరోసారి బలంగా చాటారు.
స్వచ్ఛభారత్ మిషన్‌కు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అందరికీ తెలిసినదే. 2014 నుంచి స్వచ్ఛభారత్ దిశగా భారత్ దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే వేళ స్వచ్ఛభారత్ ప్రాధాన్యతను చాటిన ప్రధాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..
Read More National News and Latest Telugu News