Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..
ABN , Publish Date - Mar 31 , 2025 | 02:53 PM
దేశనాయకత్వాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తాను నమ్ముతున్నానని, తన రిటైర్మెంట్ అప్లికేషన్ అందజేయడానికి ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని సంజయ్ రౌత్ అన్నారు.

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి సెప్టెంబర్‌లో పదవీవిరమణ (Retire) చేయాలని అనుకుంటున్నారని, నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఆయన ఇటీవల సందర్శించడం వెనుక అదే కారణం కావచ్చని అన్నారు. గత పది, పదకొండేళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లని మోదీ ఇప్పుడు ఆ పని చేశారంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలుసుకుని ''టాటా..బై..బై'' చెప్పడానికే కావచ్చని తెలిపారు. దేశనాయకత్వాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తాను నమ్ముతున్నానని, తన రిటైర్మెంట్ అప్లికేషన్ అందజేయడానికి ఆయన (మోదీ) ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని అన్నారు.
Nidhi Tewari: చిన్న వయసులోనే ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా.. ఎవరీ నిధి తివారీ
"ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటోందని నేను నమ్ముతున్నాను. పీఎం పదవీకాలం ముగిసింది. దీనితో పాటు తదుపరి బీజేపీ చీఫ్‌ను కూడా ఎన్నుకోవాలనుకుంటోంది'' అని ముంబైలో మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌రౌత్ చెప్పారు.
2029లోనూ మోదీనే..
కాగా, మోదీ రిటైర్మెంట్ ప్లాన్‌పై సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తోసిపుచ్చారు. దేశానికి మోదీ ఇంకా చాలా ఏళ్లు నాయకత్వం వహిస్తారని అన్నారు. 2029లోనూ మోదీని ప్రధానమంత్రిగా మనం చూస్తామని, ఆయన వారసుని అన్వేషించాల్సిన అవసరం లేదని చెప్పారు. ''ఆయనే మా నేత, ఆయనే కొనసాగుతారు. మన సంస్కృతిలో తండ్రి బతికుండగా వారసుని గురించి మాట్లాడం. అది మెఘులుల సంస్కృతి. దానిపై (మోదీ వారసత్వంపై) చర్చించేందుకు ఇంకా సమయం రాలేదు" అని ఫడ్నవిస్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News