Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడు అరెస్ట్
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:40 AM
Saif Ali Khan Case Accused: చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది సైఫ్ అలీ ఖాన్ కేసు. అంత సెక్యూరిటీ మధ్య సైఫ్ ఇంట్లోకి దుండగుడు ఎలా చొరబడ్డాడు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్ కేసుతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనపై ఓ దుండగుడు కత్తితో తీవ్రంగా దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైఫ్ మీద దాడి చేసిన నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. ప్రస్తుతం నిందితుడ్ని అక్కడి బాండ్రా పోలీసు స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
కోటి డిమాండ్!
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సైఫ్ ఫ్లాట్‌లోకి వచ్చిన నిందితుడు.. మొదట పని మనిషి ఎలియామ్ ఫిలిప్స్‌పై కత్తితో అటాక్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆమెను బంధించిన దుండగుడు.. కోటి రూపాయలు ఇస్తేనే వదిలేస్తానంటూ బెదిరించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సైఫ్ అతడ్ని ధైర్యంగా ఎదిరించాడు. దీంతో దాడికి తెగబడిన దుండగుడు.. సైఫ్‌ను పొడిచి మెట్ల గుండా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయాలపాలైన సైఫ్‌ను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. కారు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అతడికి మెడ, వెన్నెముక భాగంలో సర్జరీ అయిందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఇవీ చదవండి:
గన్ లైసెన్స్ ఇవ్వండి ప్లీజ్..
ఏఐ కంటెంట్‌పై లేబుల్స్ తప్పనిసరి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి