Sanjay Raut: కంగనా తరహాలోనే కునాల్‌కు ప్రత్యేక రక్షణ.. సంజయ్ రౌత్ డిమాండ్
ABN , Publish Date - Mar 29 , 2025 | 03:31 PM
షిండేపై వ్యాఖ్యలకు సంబంధించి కామ్రాపై ఖార్ పోలీసుస్టేషన్‌లో శనివారంనాడు 3 కేసులు నమోదయ్యాయి. జలగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్ర (Kunal Kamra)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ (Special Protection) కల్పించాలని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేసారు. కామ్రపై ఖార్ పోలీస్ స్టేషన్‌లో మరో మూడు కేసులు శనివారంనాడు నమోదు అయ్యాయి. దీనిపై మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, శివసేనతో వివాదం సమయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు ప్రత్యేక రక్షణ కల్పించినట్టే ఇప్పుడు కామ్రకు కూడా ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Eknath Shinde Joke Row: కునాల్ కామ్రపై కొత్తగా మరో 3 కేసులు
''కంగనా రనౌత్ అప్పట్లో మాతో (శివసేన) గొడవపడ్డారు. ఆ సమయంలో మేము ఆమెకు ప్రత్యేక రక్షణ కల్పించాం. ఇప్పుడు కునాల్ కామ్రకు సైతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలి'' అని రౌత్ అన్నారు. షిండేపై వ్యాఖ్యలకు సంబంధించి కామ్రాపై ఖార్ పోలీసుస్టేషన్‌లో శనివారంనాడు 3 కేసులు నమోదయ్యాయి. జలగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టారు. విచారణ అధికారి ముందు హాజరుకావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే కామ్రాకు నోటీసులు ఇచ్చారు. అయితే తనకు బెదిరింపులు వస్తున్నందున వారం రోజులు గడువు కావాలంటా కామ్రా చేసిన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు.
కాగా, ముంబై నుంచి 2022లోనే తాము తమిళనాడు వచ్చేశానని, తాత్కాలిక సిటిజన్‌షిప్ పొందానని, తనను ముంబై పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలని మద్రాసు హైకోర్టును కామ్ర ఆశ్రయించారు. దీంతో ఏప్రిల్ 7 వరకూ షరతులతో కూడిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ప్రధాన స్రవంతిలోని ఒక వర్గం మీడియా మహారాష్ట్రలోని అధికార పార్టీకి మౌత్‌పీస్‌గా పనిచేస్తోందని కామ్ర ఆరోపించారు. ప్రముఖలపై కామెడీ చేయడం తన హక్కును, తాను చట్టవిరుద్ధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, చట్టానికి కట్టుబడి శిక్షను, విచారణను ఎదుర్కొంటానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు
Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు
For National News And Telugu News