AAP: ఢిల్లీ ఓటమి నేపథ్యం.. ఆప్ కీలక నియామకాలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:12 PM
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక పదవుల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్‌ను ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించింది. గోపాల్ రాయ్ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆప్ పంజాబ్ ఇన్‌చార్జిగా నియమించింది. శుక్రవారంనాడు పార్టీ పీఏసీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
Delhi Judge Cash Controversy: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. సుప్రీం కీలక ఆదేశాలు
ప్రజావాణి వినిపిస్తాం: సౌరభ్ భదర్వాజ్
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు. ఢిల్లీలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. బీజేపీ ఇచ్చిన వాగ్దానాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్‌కు ఆప్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అతిషి అభినందనలు తెలిపారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆప్ తీసుకున్నట్టు ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ చెప్పారు. గుజరాత్, గోవా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌కు ఇన్‌చార్జులను నియమించారని, పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా భరద్వాజ్, పార్టీ జమ్మూకశ్మీర్ విభాగం చీఫ్‌గా మహరాజ్ మాలిక్‌లను నియమించినట్టు చెప్పారు.
కొత్త నియామకాలివే..
గుజరాత్ ఇన్‌చార్జిగా గోపాల్ రాయ్, కో-ఇన్‌చార్జిగా దుర్గేష్ పాఠక్‌కు ఆప్ అధిష్ఠానం నియమించింది. గోవా ఇన్‌చార్జిగా పంకజ్ గుప్తా వ్యవహరిస్తారు. పంజాబ్ ఇన్‌చార్జిగా మనీష్ సిసోడియా, కో-ఇన్‌చార్జిగా సత్యేంద్ర జైన్ నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జిగా సందీప్ పాఠక్‌ను నియమించారు. రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను కూడా నియమించారు. ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా సౌరభ్ భరద్వాజ్, జమ్మూకశ్మీర్ స్టేట్ ప్రెసిడెంట్‌గా మహారాజ్ మాలిక్ నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే
Read Latest National News And Telugu News