Sanjay Raut: ఈసారి పొత్తుల్లేవు, సోలోగానే పోటీ
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:33 PM
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, ఆ ప్రభావం పార్టీపై, నేరుగా చెప్పాలంటే పార్టీ ఎదుగుదలపై పడిందని రౌత్ అన్నారు.
ముంబై: 'ఇండియా' (INDIA) కూటమిలో ఉద్రికతల వేళ మున్సిపల్ కొర్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి శివసేన (UBT) కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) శనివారంనాడు ప్రకటించారు. ఇదే విషయాన్ని నాగపూర్ పార్టీ చీఫ్ ప్రమోద్ మన్మోడేతో ఇప్పుడే చర్చించినట్టు చెప్పారు.
Devendra Fadnavis: రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. పవార్ వ్యాఖ్యలపై సీఎం
''ముంబై, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము సొంతంగానే పోటీ చేస్తున్నాం. ఏది జరిగితే అది జరుగుతుంది. మేము మా అంతగా మేమే పోటీకి వెళ్లాలని నిశ్చయించుకున్నాం. నాగపూర్‌లో సొంతంగానే పోటీ చేస్తాం. ఉద్ధవ్ థాకరే సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడే సిటీ శివసేన చీఫ్ ప్రమోద్ మన్మోడేతో దీనిపై చర్చించా'' అని మీడియాతో మాట్లాడుతూ రౌత్ చెప్పారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, ఆ ప్రభావం పార్టీపై, ప్రధానంగా పార్టీ ఎదుగుదలపై పడిందని రౌత్ అన్నారు. ఆ దృష్ట్యా మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్, నాగపూర్ పంచాయతీ ఎన్నికల్లో సొంతంగానో పోటీ చేసి పార్టీని పటిష్టం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్‌దే బాధ్యత
2024 సార్వత్రిక ఎన్నికల కోసం 'ఇండియా' కూటమి ఏర్పాటు చేసిన మాట నిజమని, అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూటమి ఒక్కసారి కూడా సమావేశం కాలేదని రౌత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి సమావేశానికి పిలుపునివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. 'ఇండియా' కూటమి ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. కూటమిలో భాగస్వాములై కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు ప్రత్యర్థులుగా ఫిబ్రవరి 5న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తలబడుతున్నాయి. దీనికితోడు కూటమిలో భాగస్వాములుగా ఉన్న అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, మమతా బెనర్జీ టీఎంసీ బహిరంగంగానే ఢిల్లీ ఎన్నికల్లో 'ఆప్'కు మద్దతు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి..
Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
Read Latest National News and Telugu News