Share News

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:22 PM

సైన్‌బోర్డులపై యువకులు బ్లాక్ ఇంక్ స్ప్రే చేస్తూ మరాఠా సామాజ్ర స్థాపకుడు శివాజీ పోస్టర్లు అంటించడం ఇందులో కనిపిస్తోంది. శివాజీ తనయుడైన శంభాజీ మరాఠా సామ్రాజ్యానికి రెండో రాజుగా పాలన సాగించారు.

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

న్యూఢిల్లీ: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ కథాంశంతో విక్కీ కౌశల్ నటింటిన "ఛావా'' సినిమా ఫీవర్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన కొందరు యువకులు రాజధానిలోని అక్బర్ రోడ్డు, హుమయూన్ రోడ్‌లోని సైన్‌బోర్డులపై బ్లాక్ ఇంక్ పూసి, ఛత్రపతి శివాజీ పోస్టర్లు అతికించారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలా హల్‌చల్ చేస్తున్నాయి. సైన్‌బోర్డులపై యువకులు బ్లాక్ ఇంక్ స్ప్రే చేస్తూ మరాఠా సామాజ్ర స్థాపకుడు శివాజీ పోస్టర్లు అంటించడం ఇందులో కనిపిస్తోంది. శివాజీ తనయుడైన శంభాజీ మరాఠా సామ్రాజ్యానికి రెండో రాజుగా పాలన సాగించారు.

Punjab Minister: 20 నెలలుగా ఉనికిలో లేని శాఖకు మంత్రి


కాగా, సైన్‌బోర్డులపై నలుపురంగు పూసి పోస్టర్లు అంటించడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకున్నారు. సైన్‌బోర్డులపై అంటింపులను తొలగించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇందుకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Air India: ఎయిర్‌ ఇండియాపై కేంద్ర మంత్రి ఫైర్.. ప్రజలను మోసగిస్తున్నారంటూ గుస్సా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 22 , 2025 | 05:20 PM