Home » Posters
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది.
టీజీ పీఎస్పీ కమిషన్ గేటు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. కమిషన్ తీరును తప్పుపడుతూ సిగ్గు.. సిగ్గు అని పోస్టర్లపై రాసుకొచ్చారు. గ్రూప్-1 పరీక్షకు 150 ప్రశ్నలు కూడా రూపొందించడం రాదని తమదైన శైలిలో విమర్శించారు.
నర్సాపురం పోస్టాఫీసు రెండు మూడు రోజులుగా మూతబడింది. ఇక్కడ పనిచేస్తున్న బీపీఎం నాయక్ విధులకు గైర్హాజరవుతున్నట్లు పైఅధికారుల దృష్టికి వెళ్ళడంతో మంగళవారం బద్వేల్ పోస్టల్ సబ్‌డివిజన్ హెడ్ ఎన్.సుబ్బరాయుడు పోస్ట్ట్‌ఆఫీసును తనిఖీ చేశారు. సిబ్బంది కార్యాలయం తెరవక పోవడంతో గ్రామస్థుల సమక్షంలో కార్యాలయం తాళాలు పగులగొట్టారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మినలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇనస్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లను ముట్టడిస్తాం, దాడులు చేస్తామని బెదిరిస్తూ, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అవాస్తవాలు ..
రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పోస్టర్లు వెలిశాయి. రావమ్మా ప్రియాంక.. ఇక్కడి నుంచి పోటీ చేయండని పోస్టర్ల మీద రాసి ఉంది. అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించాలని కూడా పోస్టర్ల మీద ఉంది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోస్టర్‌పై కొందరు అగంతకులు ఇంక్ చల్లడం కలకలం సృష్టించింది. పుణె జిల్లాలోని బారామతి తాలూకా కర్హటి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై మరోసారి పోస్టర్స్ వెలిశాయి. పోస్ట్‌లు అమ్ముకుంటున్నారని దక్షిణ నియోజకవర్గం వ్యాప్తంగా గతరాత్రి పోస్టర్లు వేయండంతో తీవ్ర కలకలం రేగింది. బుక్ మై ఎమ్మెల్యే అంటూ టిడ్కో ఇళ్ళు, దేవాలయాలు ఛైర్మన్ల పోస్ట్‌లు, పార్టీ పెదవులు అమ్మబడును అని అర్ధం వచ్చేటట్లు పోస్టర్లు వెలిశాయి.
రాహుల్ గాంధీకి ఉన్న ప్రజాదరణ, నాయకత్వ నైపుణ్యాలు చూసి బీజేపీ భయపడుతున్నందునే ఆయనను రావణుడిగా చూపిస్తూ పోస్టర్లు వేసిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. రావణుని పూర్తి కథ తెలియకుండానే సఫ్రాన్ క్యాంప్ ఈ పోస్టర్లు వేసిందని బీజేపీని తప్పుపట్టారు.
నెల్లూరు జిల్లా: కావలిలో టీడీపీ నేత కావ్య కృష్ణా రెడ్డి ‘బాబుతో నేను’ అనే పోస్టర్లను భారీగా వేయించారు. దీంతో వెంటనే ఆ పోస్టర్లను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి.