Share News

Tamil Nadu: వీడియో వైరల్.. ప్రిన్సిపల్‌పై వేటు

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:49 PM

Tamil Nadu: విద్యార్థినులతో పాఠశాలలో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ క్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌పై వేటు పడింది.

Tamil Nadu: వీడియో వైరల్.. ప్రిన్సిపల్‌పై వేటు

చెన్నై, జనవరి 14: పాఠశాలలోని టాయిలెట్‌ను విద్యార్థినితో శుభ్రం చేయించడంతో.. ప్రిన్సిపల్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన తమిళనాడు, ధర్మపూరి జిల్లాలోని పాలక్కొడు గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. పాఠశాల్లోని విద్యార్థినితో టాయిలెట్ శుభ్రం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు.. గ్రామస్తులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపి.. అందుకు బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

Also Read: సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

అయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు.. విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించడం, వాకిళ్లు ఊడిపించడంతోపాటు ముగ్గులు వేయిస్తుందంటూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విచారణ జరిపి.. ఆమెపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Also Read: మహాకుంభ మేళపై ఆసక్తికర వ్యాఖ్యలు.. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత

దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులోభాగంగా తొలుత పాఠశాల ప్రధాన ఉపాద్యాయురాలిపై సస్పెన్షన్ వేటు వేశారు.ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇక పాలక్కొడులోని పాఠశాలలో 1 నుంచి 8 వ తరగతి వరకు దాదాపు 150 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

Also Read: బీజేపీ నేతలపై సీఎం సిద్దరామయ్య ఫైర్

For National New And Telugu News

Updated Date - Jan 14 , 2025 | 05:49 PM