Eknath Shinde-Kunal Kamra: సుపారీ తీసుకున్నారేమో?.. కునాల్ వ్యాఖ్యలపై షిండే
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:50 PM
కునాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకరి తరఫున సుపారి తీసుకుని వేరే వారి గురించి తప్పుగా మాట్లాడినట్టు కనిపిస్తోందని షిండే అన్నారు. తన మాట ఎలా ఉన్నా ఇదే వ్యక్తి ప్రధానమంత్రి పైన, సుప్రీంకోర్టు పైన, పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామిపైన, మరి కొందరు పారిశ్రామికవేత్తలపై కూడా గతంలో కామెంట్లు చేశారని గుర్తుచేశారు.

ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra)తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) తొలిసారి స్పందించారు. ఆయన (కునాల్) సెటైర్‌ను తాను అర్థం చేసుకోగలనని, కానీ దేనికైనా ఒక పరిమితి ఉంటుందని అన్నారు.
Kunal Kamra: కునాల్ కామ్రాకు నోటీసులు, గడువు కోరిన స్టాండప్ కమెడియన్
కునాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకరి తరఫున సుపారి (కాంట్రాక్ట్) తీసుకుని వేరే వారి గురించి తప్పుగా మాట్లాడినట్టు కనిపిస్తోందని షిండే అన్నారు. తన మాట ఎలా ఉన్నా ఇదే వ్యక్తి ప్రధానమంత్రి పైన, సుప్రీంకోర్టు పైన, పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామిపైన, మరి కొందరు పారిశ్రామికవేత్తలపై కూడా గతంలో కామెంట్లు చేశారని గుర్తుచేశారు. దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛ అనరని, ఎవరి తరఫునో మాట్లాడి ఉంటారని అన్నారు.
హాబిటంట్ వేదికను పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో షిండే మాట్లాడుతూ, అవతల వ్యక్తులు కూడా ఒక పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంటుందని, అలాకాకుంటే ప్రతి యాక్షన్‌కు ఒక రియాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, ప్రముఖ వ్యక్తులపై జోక్స్ వేసే హక్కు తనకు ఉందని, తన కామెంట్లకు క్షమాపణ చెప్పేది లేదని కునాల్ ఇంతకుముందు వివరణ ఇచ్చారు. చట్టపరంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసులో తమ ముందు హాజరుకావాలని ముంబై పోలీసులు కునాల్‌కు మంగళవారంనాడు నోటీసులు పంపారు. అయితే తనకు వారం రోజులు గడువు కావాలని కునాల్ పోలీసులకు రాసిన ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..