Eknath Shinde Joke Row: కునాల్ కామ్రపై కొత్తగా మరో 3 కేసులు
ABN , Publish Date - Mar 29 , 2025 | 02:55 PM
కునాల్ కామ్రపై జలాగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఓ హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరకావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కామ్రకు సమన్లు పంపారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్ర (Kunal Kamra) మరిన్ని చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. ఆయనపై వెస్ట్ ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్‌లో కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యారు. జలాగావ్ సిటీ మేయర్, నాసిక్‌కు చెందిన ఓ హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరకావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కామ్రకు సమన్లు పంపారు. అయితే విచారణ మందుకు ఆయన హాజరుకాలేదు.
Myanmar Earthquake: మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ
మద్రాసు కోర్టు ఉపశమనం
తనపై పలు ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో మద్రాసు హైకోర్టును కామ్ర ఆశ్రయించారు. తాను కామెడీగా చేసిన వ్యాఖ్యలపై చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆయనకు ఏప్రిల్ 7వ తేదీ వరకూ షరతులతో కూడిన తాత్కాలిక ముందస్తు బెయిలును మద్రాసు హైకోర్టు శుక్రవారంనాడు మంజూరు చేసింది.
కునాల్ కామ్రా తన కామెడీ షోలో ఏక్‌నాథ్ షిండేను 'ద్రోహి'గా అభివర్ణించారు. మహారాష్ట్ర రాజకీయాలపైనా సెటైరికల్‌గా వ్యాఖ్యలు చేశారు. 'మహా' రాజకీయాలు గందరగోళంగా మారాయన్నారు. శివసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుంది, శివసేన నుంచి మరో శివసేన వచ్చింది, ఎన్‌సీపీ చీలిపోయి మరో ఎన్‌సీపీ వచ్చింది.. వీళ్లు ఓటరుకు 9 బటన్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ గందరగోళానికి గురయ్యారు.. అని వ్యాఖ్యానించారు. సదరు వీడియోను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడంతో షిండే మద్దతుదారులు గత ఆదివారంనాడు కామెడీ షో షూట్ చేసిన వేదకపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. కామ్రాను బహిరంగంగా తిరగనీయమంటూ హెచ్చరికలు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే కామెడీ షో కోసం తాను సెటైరికల్‌గా మాట్లాడటం తన హక్కు అనీ, తనకు తెలిసినంత వరకూ ఇది చట్టానికి వ్యతిరేకం కాదని కామ్రా చెప్పారు. చట్టపరంగా ఎలాంటి శిక్షకైనా, విచారణకైనా సిద్ధమన్నారు.
ఇవి కూడా చదవండి..
Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు
Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు
For National News And Telugu News