Share News

Vinod Kambli: ఆసుపత్రి నుంచి వినోద్ కాంబ్లి డిశ్చార్జి

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:22 PM

వినోద్ కాంబ్లి టీమిండియా న్యూ ఓడీఐ జెర్సీ ధరించి తన శ్రేయాభిలాషులకు అభివాదాలు తెలుపుతూ ఆయన ఆసుపత్రి బయటకు వచ్చారు. మిత్రులు, కుటుంబ సభ్యుల సాయంతో ఆయన మెల్లగా అడుగులేస్తూ తాను కోలుకున్నాననే సంకేతాలిచ్చారు.

Vinod Kambli: ఆసుపత్రి నుంచి వినోద్ కాంబ్లి డిశ్చార్జి

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి (Vinod Kambli) ముంబై ఆసుపత్రి నుంచి బుధవారంనాడు డిశ్చార్చ్ అయ్యారు. కొద్దికాలంగా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కాంబ్లి గత డిసెంబర్ 21న ఆరోగ్యం క్షీణించడంతో థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరారు. చికిత్సానంతరం కోలుకోవడంతో న్యూఇయర్ తొలి రోజునే ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇండియా న్యూ ODI జెర్సీ ధరించి తన శ్రేయాభిలాషులకు అభివాదాలు తెలుపుతూ ఆయన ఆసుపత్రి బయటకు వచ్చారు. మిత్రులు, కుటుంబ సభ్యుల సాయంతో ఆయన మెల్లగా అడుగులేస్తూ తాను కోలుకున్నాననే సంకేతాలిచ్చారు.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తన అభిమానులు మద్యపానానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం


ఏభై రెండేళ్ల ముంబై క్రికెటర్ వినోద్ కాంబ్లి 1991 నుంచి 2000 వరకూ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 121 ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడారు. కేవలం 17 టెస్టుల్లో 54.20 యావరేజ్ రన్ రేట్‌తో 1084 పరుగులు సాధించారు. నాలుగు టెస్ట్ సెంచరీలు చేశారు. 1993లో ముంబైలోని వాఖెండే స్టేడియంలో ఇంగ్లాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశారు.


లెఫ్ట్ హ్యాండ్‌ ఓపినింగ్ బ్యాట్స్‌‍మన్‌గా కాంబ్లి వన్డే క్రికెట్‌లో 104 మ్యాచ్‌లు ఆడి 32.59 యావరేజ్ రన్ రేటుపై 2477 పరుగులు తీశారు. రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చివరిసారిగా 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో శ్రీలంకపై ఆడారు.


ఇవి కూడా చదవండి..

PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు

UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య

Updated Date - Jan 01 , 2025 | 05:24 PM