Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:00 PM
తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమాచార సాధానాలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. అలాగే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్దమతున్నాయి. దీంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.

- మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు
- అన్నాడీఎంకేపై మంత్రి తంగం తెన్నరసు వ్యంగ్యాస్త్రం
- మొసలి కన్నీరు కార్చొద్దు: ఈపీఎస్ చురకలు
- మోసపోకుండా ఉంటే చాలు: ఈపీఎస్కు స్టాలిన్ సలహా
- బీజేపీ పొత్తు ఒత్తిళ్లపై అసెంబ్లీలో రసవత్తర చర్చ
చెన్నై: రకరకాల ఒత్తిడితో అన్నాడీఎంకేను తమ కూటమిలో చేర్చుకునేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందంటూ ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఘాటుగా సమాధానమిచ్చారు. పార్టీ పగ్గాలు తమ చేతుల్లోనే వున్నాయని, తమపై మొసలి కన్నీరు కార్చొద్దంటూ కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి వాగ్వివాదం జరుగుతుండగానే మాజీ మంత్రి తంగమణి మాట్లాడుతూ.. కూడికలు తీసివేతలు తమకు బాగా తెలుసని, పార్టీపరమైన లెక్కలు తేల్చే విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యానించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు..
అందుకు సీఎం స్టాలిన్ స్పందిస్తూ ఈ విషయంలో (బీజేపీ విషయంలో) అన్నాడీఎంకే మోసపోకుండా ఉంటే చాలంటూ సభలో నవ్వులు పూయించారు. శుక్రవారం ఉదయం శాసనసభలో బీజేపీతో పొత్తు వ్యవహారంలో రసవత్తరమైన చర్చ జరిగింది. అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థికమంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ.. అన్నాడీఎంకేని ఎవరో అపహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్త్‌ను అజ్ఞాతవ్యక్తులు తీర్మానిస్తున్నారని, పార్టీని తన్నుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నవారిపట్ల అన్నాడీఎంకే నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభలో బీజేపీ శాసనసభ్యురాలు వానతి శ్రీనివాసన్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఎట్టకేలకు పిల్లి బయటకు వచ్చేసిందంటూ మంత్రి తంగం తెన్నరసు అనగానే అన్నాడీఎంకే శాసనసభ్యులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
మీది మొసలి కన్నీరు: ఈపీఎస్
అన్నాడీఎంకేని తెరవెనుక ఎవరో నడిపిస్తున్నారంటూ అసెంబ్లీలో ఆర్థికమంత్రి తంగం తెన్నరసు అనడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే మంత్రులు అన్నాడీఎంకేపై జాలి చూపాల్సిన పనిలేదన్నారు. తమ పార్టీ ఆత్మగౌరవాన్ని విడిచిపెట్టదని, పార్టీ ఎప్పటికీ తమ ఆధీనంలోనే ఉంటుందని ఈపీఎస్ స్పష్టం చేశారు.
మోసపోకుండా ఉంటే చాలు: సీఎం స్టాలిన్
అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి తంగమణి మాట్లాడుతూ... బడ్జెట్ నిధుల కేటాయింపుపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు ముఖ్యమంత్రి ఈ లెక్కలకన్నా పార్టీకి సంబంధించిన లెక్కల్లో (పొత్తులు, సీట్ల కేటాయింపులలో) అప్రమత్తం గా ఉండాలని చెప్పటం గర్హనీయమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ జోక్యం చేసుకుంటూ పార్టీ అంచనాలు,లెక్కలకు సంబంధిం చి మీరు(అన్నాడీఎంకే)మోసపోకుండా ఉంటే హార్థికాభినందనలు తెలియజేస్తామనటంతో డీఎంకే సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News