Share News

Breaking News: సింధూ జలాల ఒప్పందంపై అమిత్‌ షా కీలక భేటీ

ABN , First Publish Date - Apr 25 , 2025 | 09:40 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: సింధూ జలాల ఒప్పందంపై అమిత్‌ షా కీలక భేటీ
Breaking News

Live News & Update

  • 2025-04-25T19:38:34+05:30

    సింధూ జలాల ఒప్పందంపై అమిత్‌ షా కీలక భేటీ

    • సింధూ జలాల ఒప్పందం రద్దు అమలుపై అధికారులకు దిశానిర్దేశం

    • హాజరైన కేంద్ర మంత్రులు CR పాటిల్‌, జైశంకర్‌, ఉన్నతాధికారులు

    • సింధూ జలాల ఒప్పందం రద్దు, భవిష్యత్‌ ప్రణాళికలు, కార్యాచరణపై చర్చ

    • భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు ఒక్క చుక్కనీరు వెళ్లకుండా చూస్తామి సీఆర్ పాటిల్ అన్నారు.

    • మూడు ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌

  • 2025-04-25T15:40:43+05:30

    పాక్‌కు సింధూ జలాల నిలిపివేతపై కీలక భేటీ..

    • ఢిల్లీ: అమిత్‌ షా నివాసంలో కీలక భేటీ.

    • పాకిస్థాన్‌కు సింధూ జలాల నిలిపివేతపై చర్చ.

  • 2025-04-25T15:25:58+05:30

    మేధ పాట్క్ అరెస్ట్.. విడుదల..

    • ఢిల్లీ: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ అరెస్ట్‌, విడుదల

    • 2000 సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌ అరెస్ట్‌

    • ఇటీవల మేధా పాట్కర్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

    • మేధా పాట్కర్‌ను విడుదల చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

    • పూచీకత్తు తీసుకుని విడుదల చేయాలని పోలీసులకు ఆదేశం

  • 2025-04-25T13:52:27+05:30

    ఢిల్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు..

    • అమరావతి నుంచి ఢిల్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు

    • సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న చంద్రబాబు

  • 2025-04-25T13:51:44+05:30

    ఉగ్రదాడిని ఖండించిన NHRC..

    • ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన NHRC

    • ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: NHRC

    • ఉగ్రవాదం నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం చేపడుతోంది: NHRC

    • నేరస్థులను న్యాయం ముందు నిలబెడతాం: NHRC

    • బాధితులను అన్నివిధాల ఆదుకుంటాం: NHRC

  • 2025-04-25T13:50:28+05:30

    నీట్ పేపర్ లీక్.. నిందితుడి అరెస్ట్..

    • నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

    • గురువారం రాత్రి పట్నాలో సంజీవ్‌ ముఖియా అరెస్ట్‌

    • సంజీవ్‌ ముఖియాను అరెస్ట్‌ చేసిన ఈవోయూ బృందం

  • 2025-04-25T12:24:49+05:30

    పతనమైన స్టాక్ మార్కెట్లు..

    • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

    • 850 పాయింట్లకుపైగా నష్టంలో సెన్సెక్స్‌

    • 250 పాయింట్లకుపైగా నష్టంలో నిఫ్టీ

  • 2025-04-25T12:23:41+05:30

    శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ జనరల్

    • శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

    • ఆర్మీ చీఫ్ పర్యటన దృష్ట్యా పలు ప్రాంతాల్లో భారీ భద్రత

    • ఉగ్రవాదులపై దళాలు తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన అధికారులు

    • జమ్మూకశ్మీర్‌లోని భద్రత అంశాలను ఆర్మీ చీఫ్ జనరల్‌కు వివరించిన అధికారులు

    • ఎల్‌వోసీ వెంట పాక్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు చేస్తున్న ప్రయత్నాలను ఆర్మీ చీఫ్‌కు వివరించిన అధికారులు

  • 2025-04-25T11:13:51+05:30

    ఉగ్రవాది హతం..

    • లష్కరే తొయిబా టాప్ కమాండర్‌ అల్తాఫ్‌ హతం

    • బందిపొరా ఎన్‌కౌంటర్‌లో అల్తాఫ్‌ లల్లి మృతి

    • ఉదయం నుంచి బందిపొరాలో కొనసాగుతున్న కాల్పులు

    • పహల్గామ్‌ దాడి నేపథ్యంలో భద్రతా బలగాల సెర్చ్‌ ఆపరేషన్‌

  • 2025-04-25T09:42:54+05:30

    బొగ్గు రవాణా నిలిపిన లారీ ఓనర్లు

    • భద్రాద్రి: BTPSకు బొగ్గు రవాణా నిలిపిన లారీ ఓనర్లు

    • మణుగూరు-BTPSకు బొగ్గు సరఫరా చేస్తున్న..

    • 120 టిప్పర్లను నిలిపివేసిన లారీల యజమానుల

    • లారీ యజమానులకు బిల్లులు చెల్లించని కాంట్రాక్టర్లు

    • బకాయి బిల్లులు చెల్లించే వరకు నిరసన: లారీ ఓనర్లు

  • 2025-04-25T09:40:36+05:30

    జమ్ముకశ్మీర్‌లో సైన్యం సెర్చ్‌ ఆపరేషన్‌

    • బిజ్‌బెహరా, త్రాల్‌ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్‌

    • పుల్వామా జిల్లా త్రాల్‌లో ఉగ్రవాది ఆసిఫ్‌ ఇల్లు కూల్చివేత

    • ఐఈడీ బాంబులతో ఇల్లు పేల్చేసిన బలగాలు

    • బిజ్‌బెహరాలో మరో ఉగ్రవాది ఆదిల్‌ ఇల్లు కూల్చివేత

    • పహల్గామ్‌ ఉగ్రదాడిలో ఆదిల్‌, ఆసిఫ్‌ సూత్రధారులు